Baba Ramdev: అనపర్తిలో పర్యటించిన బాబా రామ్ దేవ్.. స్థానిక పామాయిల్ రైతులతో ముఖాముఖి.. కారణం ఏమిటంటే..?

Baba Ramdev: పతంజలి కంపెనీ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అనేక రకాల ఉత్పత్తులతో మార్కెట్ తనకంటూ ఓ పేరుని సంపాదించుకుంది. అయితే పతంజలి కంపెనీ ఇప్పుడు పామాయిల్‌ను స్వయంగా ఉత్పత్తి చేస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు బాబా రామ్‌దేవ్.

Baba Ramdev: అనపర్తిలో పర్యటించిన బాబా రామ్ దేవ్.. స్థానిక పామాయిల్ రైతులతో ముఖాముఖి.. కారణం ఏమిటంటే..?
Baba Ramdev
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jun 16, 2023 | 5:40 AM

Baba Ramdev: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి రంగంపేటలో ప్రముఖ యోగ గురువు రామ్ దేవ్ బాబా పర్యటించారు. స్థానిక పామాయిల్ సాగు రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఆయిల్ పామ్ ప్లాంటేషన్ నర్సరీ, ఫీల్డ్‌లో 5 లక్షల హెక్టార్ల భూమిలో పతంజలి మిషన్ ఆఫ్ ఆయిల్ పామ్ ప్లాంటేషన్ గురించి రైతులకు వివరించారు. ఏపీలో పామాయిల్ దిగుబడి మరింత పెంచేందుకు కృషి చేస్తామని తెలిపారు. రైతులకు పామాయిల్ సాగుకు అవసరమైన శిక్షణ, సాంకేతిక సహాయం చేస్తామన్నారు రాందేవ్ బాబా.

రంగంపేట మండలం దొంతమూరు పామాయిల్ తోటల్లో పర్యటించిన ఆయన … పెద్దాపురంలో పామాయిల్ రుచి పరిశ్రమకు పతాంజలి పరిశ్రమగా నామకరణం చేశారు. రాష్ట్రంలో లక్ష 50 వేల ఎకరాల్లో పామాయిల్ సాగు చేస్తున్నారని, కేవలం తూర్పుగోదావరి జిల్లాలోనే 30 శాతం పామాయిల్ సాగుఉందన్నారు. ఈ సాగును మరింత పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని రాందేవ్ బాబా చెప్పారు. గంటకి 75 టన్నులు తీస్తున్న పరిశ్రమ 200 టన్నులకు పెంచాలని రైతులకు సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..