Sun day Puja Tips: డబ్బు సమస్యలా లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఆదివారం ఈ పరిహారాలు చేసి చూడండి
జాతకంలో సూర్యుడిని బలోపేతం చేయడానికి ఆదివారం ఉత్తమ రోజుగా పరిగణించబడుతుంది. వృత్తి, వ్యాపారంలో పురోగతిని పొందడానికి సూర్యునికి సంబంధించిన చర్యలను గురించి తెలుసుకుందాం.
ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడి ఆరాధనకు ఆదివారం చాలా ప్రత్యేకమైన రోజు. జ్యోతిషశాస్త్రంలో కూడా సూర్యుడు వృత్తి, విజయం, గౌరవానికి కారకంగా పరిగణింపబడ్డాడు. ఎవరి జాతకంలో సూర్యుడు స్థానం బలోపేతంగా, ప్రభావవంతంగా ఉంటుందో వారు విజయాన్ని పొందుతారు. జాతకంలో సూర్యుడిని బలోపేతం చేయడానికి ఆదివారం ఉత్తమ రోజుగా పరిగణించబడుతుంది. వృత్తి, వ్యాపారంలో పురోగతిని పొందడానికి సూర్యునికి సంబంధించిన చర్యలను గురించి తెలుసుకుందాం.
ఆదివారం సూర్యునికి అర్ఘ్యం సమర్పించండి..
ఆదివారం సూర్యోదయ సమయంలో నిద్ర లేచి స్నానం చేసిన అనంతరం.. దేవుడికి పూజ చేయాలి. అనంతరం ఉదయించే సూర్యునికి అర్ఘ్యం సమర్పించండి. ఆదివారం నాడు సూర్యుడిని ఆరాధించడం వల్ల ఉద్యోగ, వ్యాపారాలలో విజయం సాధిస్తారు.
అన్ని అడ్డంకులను తొలగించడానికి చేయాల్సిన పరిహారం..
మీరు చేపట్టిన పనిలో నిరంతరం అడ్డంకులు ఎదుర్కుంటూ ఉంటే ఆదివారం రోజున నది లేదా సరస్సు వద్దకు వెళ్లి చేపలకు ఆహారాన్ని అందించండి. చేపలకు ఆహారం తినిపించడం వలన సూర్యుడు స్థానం బలపడి.. శుభఫలితాలు పొందుతారు. దీనితో పాటు వ్యక్తి అప్పుల నుండి విముక్తి లభిస్తుంది.
డబ్బు కు సంబంధించిన సమస్యలను తొలగించేందుకు చేయాల్సిన పరిహారం..
ఎవరైనా డబ్బుకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతుంటే.. ఆదివారం కొత్త చీపురు కొనుగోలు చేయండి. మర్నాడు ఉదయం పూజగదిలో ఉంచండి. ఇలా చేసే సమయంలో ఎవరూ చూడకుండా జాగ్రత్త వహించండి. ఇలా చేయడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి.
లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఆదివారం చేయాల్సిన పరిహారం..
ఎవరైనా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటే, ఆదివారం ఇంటి ప్రధాన ద్వారంపై రెండు వైపులా నెయ్యి దీపాలు పెట్టండి. ఇలా చేయడం వలన ఆ కుటుంబ సభ్యులపై అనుగ్రహం నిలిచి ఉంటుంది.
విజయాన్ని పొందడానికి చేయాల్సిన పరిహారం..
ఆదివారం రోజున రాగి, పప్పు, గోధుమలు, బెల్లం దానం ఇవ్వాలి. దీనితో పాటు పూజా స్థలంలో సూర్య యంత్రాన్ని ఏర్పాటు చేయాలి. అంతేకాదు సూర్యుడికి రోజూ అర్ఘ్యం సమర్పించండి. ఈ పరిహారంతో సూర్య భగవానుడి అనుగ్రహం వ్యక్తిపై ఉంటుంది. చేపట్టి పనిలో విజయం సాధిస్తారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).