Shani Vakri: కుంభంలోకి తిరోగమించిన శనిదేవుడు.. ఈ రాశులవారికి నవంబర్ 4 వరకు కష్టకాలమే.. మీరూ ఉన్నారా..?

Shani Vakri: జ్యోతిష్యశాస్త్రంలో శనిదేవుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఇతర గ్రహాలకంటే కూడా ఎక్కువగా శని మానవ జీవితాలను ప్రభావితం చేస్తాడు. అయితే శనిదేవుడి అనుగ్రహం ఉంటే ఎంతటి దరిత్రుడైనా ధనవంతుడిగా మారిపోతాడు. కానీ శనివారం శని కుంభరాశిలోకి తిరోగమించాడు. ఫలితంగా కొందరు కఠినమైన పరిస్థితులను..

Shani Vakri: కుంభంలోకి తిరోగమించిన శనిదేవుడు.. ఈ రాశులవారికి నవంబర్ 4 వరకు కష్టకాలమే.. మీరూ ఉన్నారా..?
Shani Vakri 2023
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jun 18, 2023 | 7:02 AM

Shani Vakri: జ్యోతిష్యశాస్త్రంలో శనిదేవుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఇతర గ్రహాలకంటే కూడా ఎక్కువగా శని మానవ జీవితాలను ప్రభావితం చేస్తాడు. అయితే శనిదేవుడి అనుగ్రహం ఉంటే ఎంతటి దరిత్రుడైనా ధనవంతుడిగా మారిపోతాడు. కానీ శనివారం శని కుంభరాశిలోకి తిరోగమించాడు. ఫలితంగా కొందరు కఠినమైన పరిస్థితులను ఎదుర్కొనవలసి ఉంది. అవును, జూన్ 17న అంటే నిన్న శనిగ్రమం కుంభరాశిలోకి తిరోగమించింది. ఇంకా నవంబర్ 4వ తేదీ వరకు కూడా శని కుంభంలోనే ఉంటాడు. శని తిరోగమం కారణంగా ప్రతికూలంగా ప్రభావితమయ్యేవారు.. ఈ సమయంలో ఎన్నో ఆర్థిక, ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. గొడవలకు దారితీసే పరిస్థితుల్లోకి లాగబడతారు. ఇంతకీ ఆ రాశులేమిటో ఇప్పుడు చూద్దాం..

మీనరాశి: శని వక్రి మీనరాశివారికి కష్టకాలాన్ని తీసుకొస్తుంది. నోరు మెదపడమే సమస్యకు కారణం అనే పరిస్థితి కూడా వస్తుంది. ఇంకా ఇంట్లో మీ భాగస్వామితో గొడవలు, ఆర్థిక బాధలతో తీవ్ర ఇబ్బందులు పడతారు.

వృశ్చిక రాశి: శని తిరోగమనం కారణంగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వృశ్చికరాశివారికి నిరాశే మిగులుతుంది. ఇంకా ఈ సమయంలో అప్పులపాలయ్యే ప్రమాదం ఉంది. కంటికి కనిపించనంత దూరంగా డబ్బు మీ నుంచి చేజారుతుంది.

ఇవి కూడా చదవండి

సింహరాశి: కుంభరాశిలోకి శని వక్రించిన కారణంగా సంహరాశివారు కూడా కష్టాల పాలవుతారు. ముఖ్యంగా మానసిక, ఆరోగ్య సమస్యలతో సతమతమవుతారు. ఇవే సమస్య అనుకుంటే.. ప్రత్యర్థుల కారణంగా అవమానాలను ఎదుర్కొనే అవకాశం ఉంది.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..