Watch Video: పులి పిల్లతో చిన్నారి ఎలుగు ఆటలు.. వీడియో చూసి ‘సింబా ఎక్కడా’ అంటున్న నెటిజన్లు..

Watch Video: ఏదైనా వీధిలోని పెద్దొళ్ల మధ్య గొడవలు ఉన్నా అవేమి పట్టని వాళ్ల పిల్లలు మాత్రం స్నేహభావంతో కలిసిమెలిసి ఉంటారు. ఇలాంటి అనుభవాలు అందరికీ సర్వసాధారణంగానే ఉంటాయి. అలాంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్..

Watch Video: పులి పిల్లతో చిన్నారి ఎలుగు ఆటలు.. వీడియో చూసి ‘సింబా ఎక్కడా’ అంటున్న నెటిజన్లు..
Tiger Cub And Young Bear
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jun 17, 2023 | 7:44 AM

Watch Video: ఏదైనా వీధిలోని పెద్దొళ్ల మధ్య గొడవలు ఉన్నా అవేమి పట్టని వాళ్ల పిల్లలు మాత్రం స్నేహభావంతో కలిసిమెలిసి ఉంటారు. అందరి జీవితాల్లోనూ ఇలాంటి అనుభవాలు ఉంటాయి. అలాంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి ఆ వీడియో మనుషులకు సంబంధించినది అసలే కాదు, అలా అని జంతువులది అసలే కాదు. అది క్రూర మృగాలుగా పేరొందిన పులి, ఎలుగు పిల్లల వీడియో. అందులో చిన్నారి ఎలుగు తన ఫ్రెండ్ అయిన పులి పిల్లతో ఆడుకుంటోంది. హస్యాస్పదమైన విషయం ఏమిటంటే ఆ ఎలుగు పిల్ల కౌగిలించుకోవాలని చూస్తుంటే.. పులి పిల్ల దాన్ని కాలితో నెట్టేస్తుంది.

కొన్ని సెకన్లే ఉన్న ఆ వీడియో ఇప్పుడు నెటిజన్లకు పిచ్చపిచ్చగా నచ్చేసింది. స్నేహం అనేది క్రూర మృగాల్లోనూ ఉంటుందని, దాన్ని గ్రహించడం చాలా కష్టమని వారు అభిప్రాయపడుతున్నారు. ఇంకా అవి సాధారణ ఎలుగు, పులి పిల్లలు కాదని.. షేర్ ఖాన్, బలూ అని వ్యాఖ్యానిస్తున్నారు. ‘అతి క్రూరమైన 3 జంతువుల పిల్లల్లో 2 మాత్రమే ఇక్కడ ఉన్నాయి.. సింబా(సింహం పిల్ల) ఎక్కడా, నిజంగానే తప్పిపోయిందా’ అని కూడా సరదాగా అడుగుతున్నారు.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న ‘షేర్ ఖాన్, బలూ’ వీడియో..

View this post on Instagram

A post shared by bear.chanel (@bear.chanel)

ఇలా వీడియోను చూసిన నెటిజన్లు ఇలా తమకు తోచిన విధంగా స్పందిస్తున్నారు. ఇంకా క్యూట్ యానిమల్స్ అని చెబుతూ ఎమోజీలను షేర్ చేస్తున్నారు. మరో వైపు ఈ వీడియోకు ఇప్పటివరకు సుమారుగా 90 వేల లైకులు.. లక్షల మొత్తంలో వీక్షణలు అందాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..