Video: బ్యాట్‌కి తాకిన బంతి.. కీపర్ అద్భుత క్యాచ్.. నో బాల్ అస్సలే కాదు.. బ్యాటర్ మాత్రం ఔట్ కాదు.. ఎందుకో తెలుసా?

ENG vs AUS: స్నికో మీటర్‌తో రీప్లేలో చూపినప్పుడు, బంతి బ్యాట్ అంచును తాకినట్లు తేలింది. కానీ, ఆస్ట్రేలియా ఆటగాడు ఎవరూ దాని గురించి అప్పీల్ చేయలేదు. తద్వారా జట్టు వికెట్లు తీసే అవకాశాన్ని కోల్పోయింది. దీన్ని సద్వినియోగం చేసుకున్న క్రాలీ హాఫ్ సెంచరీ చేశాడు.

Video: బ్యాట్‌కి తాకిన బంతి.. కీపర్ అద్భుత క్యాచ్.. నో బాల్ అస్సలే కాదు.. బ్యాటర్ మాత్రం ఔట్ కాదు.. ఎందుకో తెలుసా?
Ollie Pope Wicket Video
Follow us
Venkata Chari

|

Updated on: Jun 17, 2023 | 7:27 AM

ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య శుక్రవారం నుంచి యాషెస్ సిరీస్ ప్రారంభం కానుంది. సిరీస్‌లో తొలి టెస్టు బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతోంది. తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టీం టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి సెషన్ ముగిసే సరికి ఆస్ట్రేలియా కూడా 3 వికెట్లు తీసింది.

వికెట్ అవకాశాన్ని కోల్పోయిన ఆస్ట్రేలియా..

మ్యాచ్‌ తొలి రోజు తొలి సెషన్‌లో స్కాట్‌ బోలాండ్‌ బంతికి వికెట్‌ పడే అవకాశం ఉంది. కానీ, ఆ అవకాశాన్ని ఆస్ట్రేలియా కోల్పోయింది. జాక్ క్రౌలీ బోలాండ్ క్రీజులో ఉన్నాడు. బోలాండ్ ఆఫ్-స్టంప్ వెలుపల వేసిన బంతిని, క్రౌలీ కొంచెం ముందుకు వెళ్లి సైడ్‌లో ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ, బంతి అతని బ్యాట్ అంచుని తీసుకొని వికెట్ కీపర్ అలెక్స్ కారీ గ్లోవ్స్‌లోకి వెళ్లింది. అయితే, బోలాండ్‌తోపాటు మొత్తం ఆస్ట్రేలియా జట్టు బంతి మిస్ అయిందని భావించారు.

ఇవి కూడా చదవండి

కానీ, స్నికో మీటర్‌తో రీప్లేలో చూపినప్పుడు, బంతి బ్యాట్ అంచును తాకినట్లు తేలింది. కానీ, ఆస్ట్రేలియా ఆటగాడు ఎవరూ దాని గురించి అప్పీల్ చేయలేదు. తద్వారా జట్టు వికెట్లు తీసే అవకాశాన్ని కోల్పోయింది. దీన్ని సద్వినియోగం చేసుకున్న క్రాలీ హాఫ్ సెంచరీ చేశాడు.

View this post on Instagram

A post shared by Spark Sport (@sparknzsport)

క్రాలీ హాఫ్ సెంచరీ..

మొదటి సెషన్‌లో రెండు జట్లు సత్తా చాటాయి. కేవలం 22 పరుగుల వద్ద ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. జోష్ హేజిల్ వుడ్ బెన్ డకెట్ ను పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత క్రౌలీ, పోప్‌లు 70 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మొత్తం స్కోరు 92 వద్ద పోప్ పెవిలియన్‌కు చేరుకున్నాడు. క్రౌలీ తన అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. ఆపై 27వ ఓవర్ నాలుగో బంతికి బోలాండ్ క్యారీకి క్యాచ్ ఇచ్చాడు. క్రాలీ 73 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్ల సాయంతో 61 పరుగులు చేశాడు. తొలి సెషన్‌లో ఇంగ్లండ్ మూడు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది.

తొలిరోజు బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ 398/8 స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. స్టంప్స్‌కు ముందే ఆస్ట్రేలియా బ్యాటింగ్ ప్రారంభించింది. ఆట ముగిసే సమయానికి 4 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా 14 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (8), ఉస్మాన్ ఖవాజా (4) క్రీజులో ఉన్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..