Team India: 74 రోజుల తర్వాత మరో కీలక సమరం.. ఆ ముగ్గురి రీఎంట్రీతో ప్రత్యర్థులకు ముచ్చెమటలే..
Indian Cricket Team: ఆగష్టు 31న ప్రారంభమయ్యే ఆసియా కప్-2023 నాటికి, టీమిండియా ముగ్గురు దిగ్గజాలు ఫిట్‌గా ఉంటారని తెలుస్తోంది. దీంతో వారు తిరిగి జట్టులోకి వస్తే.. టీమిండియాను అడ్డుకోవడం చాలా కష్టమవుతుంది.
Asia cup 2023: ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భారత క్రికెట్ జట్టు ఫైనల్‌కు చేరగానే.. ఈసారి టీమ్ ఇండియా టైటిల్ గెలుస్తుందని అందరూ ఊహించారు. కానీ, ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. టీమ్ ఇండియా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. ఈ సమయంలో చాలా మంది భారత ఆటగాళ్లు గాయపడటం, అందుకే ఫైనల్‌లో ఆడలేకపోవటం కూడా దీనికి పెద్ద కారణంగా నిలిచింది. కానీ, నేటి నుంచి సరిగ్గా 74 రోజుల తర్వాత, టీమిండియా ఆసియా కప్-2023లో ప్రవేశించనుంది. అయితే, ఈలోపు గాయపడిన ఆటగాళ్లు కూడా రానున్నారు.
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో, భారత్‌కు అత్యుత్తమ ఓపెనర్లలో ఒకరైన కేఎల్ రాహుల్ లేడు. అతనితో పాటు ప్రస్తుత కాలంలో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కూడా లేడు. శ్రేయాస్ అయ్యర్ కూడా గాయపడటంతో ఫైనల్ ఆడలేకపోయాడు. రిషబ్ పంత్ కూడా కారు ప్రమాదం కారణంగా చాలా కాలం క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు.
ఆసియా కప్‌లోకి నూతనోత్సాహంతో..
ఈ నలుగురు ఆటగాళ్లు టీమ్‌ఇండియాలో ఉంటే బహుశా భారత్ టెస్టు ఛాంపియన్‌షిప్ గెలిచి ఉండేది. అయితే ఈ నలుగురు ఆటగాళ్లలో ముగ్గురు ఆసియా కప్‌లో పునరాగమనం చేసే ఛాన్స్ ఉంది. ఐపీఎల్-2023లో కేఎల్ రాహుల్ తొడ గాయానికి గురయ్యాడు. అందుకే ఫైనల్ ఆడలేదు. జస్ప్రీత్ బుమ్రా గత సంవత్సరం వెన్ను గాయంతో బాధపడ్డాడు. దాని కారణంగా అతను T20 ప్రపంచ కప్, IPL, టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కూడా ఆడలేకపోయాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలోని చివరి టెస్ట్ మ్యాచ్‌లో అయ్యర్ వెన్ను గాయానికి గురయ్యాడు. ఈ కారణంగా అతను దూరమయ్యాడు.
ఇటీవల, ESPNcricinfo వెబ్‌సైట్ తన నివేదికలో ఆసియా కప్‌కు బుమ్రా, అయ్యర్ అందుబాటులో ఉండవచ్చని పేర్కొంది. బుమ్రా న్యూజిలాండ్‌లో శస్త్రచికిత్స చేయించుకోగా, అయ్యర్ లండన్‌లో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. వీరిద్దరూ ప్రస్తుతం బెంగళూరులోని ఎన్‌సీఏలో ఉన్నారు. వీరిద్దరూ ఆసియా కప్ వరకు ఫిట్‌గా ఉండవచ్చని NCAలోని వైద్య సిబ్బంది చాలా సానుకూలంగా ఉన్నారు. రాహుల్‌కు గత నెలలో శస్త్రచికిత్స జరిగింది. శుక్రవారం కొన్ని ఫోటోలను పోస్ట్ చేసి మెరుగుపడుతున్నట్లు రాహుల్ చెప్పుకొచ్చాడు. రాహుల్ కూడా ఆసియా కప్ వరకు ఫిట్‌గా ఉంటారని భావిస్తున్నారు.
జట్టు బలం పెరుగుతుంది..
ఈ ముగ్గురు ఆటగాళ్లు ఫిట్‌గా ఉన్న తర్వాత జట్టులోకి వస్తే.. కచ్చితంగా జట్టుకు బలం చేకూరుతుంది. రాహుల్ అద్భుతమైన బ్యాట్స్‌మెన్‌తో పాటు వన్డేల్లో వికెట్ కీపర్ పాత్ర కూడా పోషిస్తున్నాడు. ఈసారి ఆసియా కప్ వన్డే ఫార్మాట్‌లో జరుగుతుంది. అతని రాకతో జట్టును కష్టాల నుంచి గట్టెక్కించే అనుభవజ్ఞుడైన బ్యాట్స్‌మన్ జట్టులో ఉంటాడు. బుమ్రా బౌలింగ్ గురించి ప్రపంచానికి తెలుసు. అతను ఎలాంటి బ్యాటింగ్ ఆర్డర్‌నైనా నాశనం చేయగలడు. ఇక అయ్యర్ విషయానికి వస్తే.. అతని రాక జట్టు మిడిల్ ఆర్డర్‌కు బలం చేకూరుస్తుంది. అయ్యర్ వన్డేల్లో జట్టు మిడిల్ ఆర్డర్‌ను చక్కగా హ్యాండిల్ చేస్తుంటాడు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శుభ్‌మన్ గిల్ వంటి ఆటగాళ్లతో పాటు ఈ ముగ్గురూ ఎప్పుడైతే మైదానంలోకి దిగుతారో.. అప్పుడు జట్టులోని సత్తాను చూసి ప్రత్యర్థి జట్టును నిలబెట్టే జట్టు ఇదే కావొచ్చు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..