Viral Video: పాముతో బుడతడి ఆటలు.. పూజగదిలో కూర్చున్నోళ్లంతా హడల్.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో..

Viral Video: చిన్న పిల్లలకు ఏది మంచిది, ఏది ప్రమాదకరమైనదనే అవగాహన లేకపోగా.. కనిపించిన ప్రతిదీ కూడా తమ ఆట వస్తువే అనుకుంటారు. అలాంటి ఓ చిన్నోడు తన ఇంట్లోనివారందరికీ గుండె ఆగే పని చేశాడు. అవును, ఆడుకోవడానికి ఏది లేనట్లుగా ఏకంగా..

Viral Video: పాముతో బుడతడి ఆటలు.. పూజగదిలో కూర్చున్నోళ్లంతా హడల్.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో..
Little Kid With His Snake
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jun 17, 2023 | 8:20 AM

Viral Video: చిన్న పిల్లలకు ఏది మంచిది, ఏది ప్రమాదకరమైనదనే అవగాహన లేకపోగా.. కనిపించిన ప్రతిదీ కూడా తమ ఆట వస్తువే అనుకుంటారు. అలాంటి ఓ చిన్నోడు తన ఇంట్లోనివారందరికీ గుండె ఆగే పని చేశాడు. అవును, ఆడుకోవడానికి ఏది లేనట్లుగా ఏకంగా బతికున్న పామునే పట్టుకుని ఇంట్లో తిరుగుతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఆ వీడియోలో ఏ జరుగుతుందంటే.. ఓ చిన్నోడు బతికున్న పాము తోకను పట్టుకుని పూజ గదిలోకి ప్రవేశిస్తాడు.

అయితే అప్పటికే పూజగదిలో పిల్లలతో కూర్చుని ఉన్నవారంతా ఒకసారిగా భయంతో లేచి పక్కకు వెళ్తారు. ఆ బుడ్డోడు ఇంకా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తుండగానే.. ఓ వ్యక్తి అక్కడకు వచ్చి చిన్నోడిని గది బయటకు తీసుకువెళ్తాడు. __jay_meldi_maa అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి జూన్ 2న పోస్ట్ అయిన ఈ వీడియోకు ఇప్పటివరకు 2 లక్షల 93 వేల లైకులు, 90 లక్షల వరకు వీక్షణలు లభించాయి. అయితే వీడియోపై స్పందనలు తెలియజేసేందుకు కామెంట్ సెక్షన్ డిజెబుల్‌లో ఉంది. దీంతో నెటిజన్లకు తమ స్పందనలు తెలిపే అవకాశం లేకుండా పోయింది.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియోను మీరు ఇక్కడ చూడవచ్చు..

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..