Watch Video: దమ్ముంటే బయటకు రారా..! అద్దంలోని ప్రతిబింబంతో కుక్క పిల్ల గొడవ.. వైరల్ అవుతున్న వీడియో..

Watch Video: పెంపుడు జంతువులుగా పెంచుకునే కుక్కలు, పిల్లులు చాలా గమ్మత్తయినవి. ఎలాంటి వారినైనా ఆకర్షించి, తమ మాయలో పడేలా చేయగలవు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో అనేకం వైరల్ అవుతుంటాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట..

Watch Video: దమ్ముంటే బయటకు రారా..! అద్దంలోని ప్రతిబింబంతో కుక్క పిల్ల గొడవ.. వైరల్ అవుతున్న వీడియో..
Dog Fighting Visuals
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jun 17, 2023 | 8:49 AM

Watch Video: పెంపుడు జంతువులుగా పెంచుకునే కుక్కలు, పిల్లులు చాలా గమ్మత్తయినవి. ఎలాంటి వారినైనా ఆకర్షించి, తమ మాయలో పడేలా చేయగలవు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో అనేకం వైరల్ అవుతుంటాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఓ కుక్క పిల్ల చేసిన పనికి పెట్ లవర్స్ తెగ సంబరపడిపోతున్నారు. అంతగా ఆ కుక్క పిల్ల ఏం చేసింది అనకుంటున్నారా..? ఎంతో ముద్దుగా గొడవ పడుతోంది. అయితే ఆ గొడవ ఇతరులతోనో లేదా వేరే కుక్కలతోనో అయితే అందులో ప్రత్యేకత ఏముంటుంది..? అందుకే ఆ చిన్నారి కుక్కు అద్దంలోని తన ప్రతిబింబంతో గొడవకు దిగింది.

చూడడానికి జిమ్‌లా ఉన్న ప్లేసులో ఆ కుక్క పిల్ల తన ప్రతిబింబాన్ని అద్దంలో చూసింది. అంతే.. వేరే కుక్క పిల్ల తన వద్దకు వచ్చిందని ప్రతిబింబంపైకి దూకుతుంది. అలా సాగుతున్న వీడియో నెటిజన్లకు తెగ నచ్చేసింది. ఇక ఈ వీడియోపై వారు రకరకాలుగా కామెంట్లు చేస్తూ తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ‘నాకు నేనే పోటీ’ అని ఆ కుక్క పిల్ల  అనుకుంటుందని కామెంట్ చేశాడు ఓ నెటిజన్. ఇదే తరహాలో మరొకరు ‘వెనక్కు వెళ్లిపో.. ముందుకు వస్తే కొడతా..’ అని కామెంట్ చేశారు. ఇలా నెటిజన్లు తమ స్పందనలను కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ క్యూట్ వీడియోకు ఇప్పటివరకు 2 లక్షల 30 వేల లైకులు.. 1 కోటి 70 లక్షల వరకు వీక్షణలు వచ్చాయి.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న వీడియో..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..