National: బతికుండగానే పెద్దకర్మ, సమాధి.. స్వయంగా తానే 300 మందికి భోజనాలు.
ఏ వ్యక్తి కూడా జీవించి ఉన్న సమయంలో తన మరణం గురించి పొరపాటున కూడా ఆలోచించడు. అలా ఆలోంచాల్సిన అవసరం కూడా రాదు. మరణం లేదన్న నమ్మకంతోనే జీవిస్తుంటారు. అయితే ఓ వ్యక్తి మాత్రం దీనికి భిన్నంగా ఆలోచించాడు. తన మరణం తర్వాత నిర్వహించే కార్యక్రమాలను తానే నిర్వహించుకోవాలనుకున్నాడు. అనుకున్నదే..

ఏ వ్యక్తి కూడా జీవించి ఉన్న సమయంలో తన మరణం గురించి పొరపాటున కూడా ఆలోచించడు. అలా ఆలోంచాల్సిన అవసరం కూడా రాదు. మరణం లేదన్న నమ్మకంతోనే జీవిస్తుంటారు. అయితే ఓ వ్యక్తి మాత్రం దీనికి భిన్నంగా ఆలోచించాడు. తన మరణం తర్వాత నిర్వహించే కార్యక్రమాలను తానే నిర్వహించుకోవాలనుకున్నాడు. అనుకున్నదే తడువుగా బతికుండగానే తన పెద్ద కర్మను తానే నిర్వహించుకున్నాడు. బతికుండగానే పెద్దకర్మ నిర్వహించుకోవడం ఏంటని ఆలోచిస్తున్నారా.? అయితే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..
ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లా కెవానా గ్రామానికి చెందిన జఠాశంకర్ అనే వ్యక్తి వినూత్న నిర్ణయం తీసుకున్నాడు. మరణానంతరం పిల్లలు తనకు పెద్దకర్మ నిర్వహిస్తారో లేదో అని అనుమాతంతో తానే స్వయంగా ఆ ముచ్చట తీర్చుకున్నాడు. గురువారం ప్రత్యేకంగా వంటలు చేసి ఏకంగా 300 మందికి విందును ఏర్పాటు చేశాడు. అంతేకాదండోయ్ మూడేళ్ల క్రితమే తన పొలంలో సమాధి కూడా ఏర్పాటు చేసుకున్నాడు.
జఠాశంకర్‌కు ఎవరూ లేరు కాబోలు, అందుకే ఇలా చేసుకున్నాడని అనుకుంటే పొరబడినట్లే.. ఎందుకంటే జఠాశంకర్‌కు మొత్తం మూడు పెళ్లిళ్లు అయ్యాయి, ఏడుగురు పిల్లలు ఉన్నారు. తన పెద్దకర్మ తానే నిర్వహించుకున్న జఠాశంకర్ మాట్లాడుతూ.. చనిపోకముందే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ఆచారాల్లో భాగం కాదు. అయినా నేను నిర్వహించుకున్నాను. ప్రస్తుతం నేను పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను. నేను ఎవరిపైనా ఎటువంటి నమ్మకం పెట్టుకోలేదు అని చెప్పుకొచ్చాడు.




మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..