Telugu News Telangana President Murmu attends Combined Graduation Parade at Air Force Academy Dundigal Telugu News
హైదరాబాద్‌లో రాష్ట్రపతి.. ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌కు ముర్ము.. చరిత్రలో తొలిసారిగా..
వీరితో పాటు శిక్షణ పొందిన మరో 8 మందితో పాటు, ట్రైనింగ్ పొందిన వారిలో ఇద్దరు వియత్నాం దేశానికి చెందిన క్యాడెట్లు కూడా ఉన్నారు. పాసింగ్ అవుట్‌కి రివ్యూయింగ్ అధికారిగా వచ్చారు ద్రౌపది ముర్ము. ఈ పరేడ్‌లో గ్రాడ్యుయేట్ అయిన వారి నుంచి
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల పర్యటన నిమిత్తం తెలంగాణకు వచ్చారు. హైదరాబాద్ నగరం దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీ (ఏఎఫ్‌ఏ)లో జరిగే కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌లో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జూన్16 శుక్రవారం రోజున హైదరాబాద్ చేరుకున్నారు. శనివారం దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ (సిజిపి) కార్యక్రమానికి రాష్ట్రపతి ముఖ్య అతిథిగా వచ్చారు. బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్రపతికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, ఇతర నేతలు స్వాగతం పలికారు.
#WATCH | President Droupadi Murmu reviews the Combined Graduation Parade at the Air Force Academy in Dundigal, Telangana pic.twitter.com/raxZtMMzsd
భారత వైమానిక దళం (IAF)లోని వివిధ శాఖలకు చెందిన ఫ్లైట్ క్యాడెట్‌ల ఛాలెంజింగ్ ప్రీ-కమిషనింగ్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసినందుకు గుర్తుగా పూర్తి సైనిక వైభవంతో 211వ కోర్సు CGP AFAలో నిర్వహించబడుతుందని రక్షణ శాఖ వెల్లడించింది. శిక్షణ పొందిన 119 ఫ్లైయింగ్ ఎయిర్ ట్రైనీ క్యాడెట్లు ఉండగా, వీరిలో 75 మంది గ్రౌండ్ డ్యూటీ ట్రైనీ క్యాడెట్లు ఉన్నారు. వీరితో పాటు శిక్షణ పొందిన మరో 8 మందితో పాటు, ట్రైనింగ్ పొందిన వారిలో ఇద్దరు వియత్నాం దేశానికి చెందిన క్యాడెట్లు కూడా ఉన్నారు. పాసింగ్ అవుట్‌కి రివ్యూయింగ్ అధికారిగా వచ్చారు ద్రౌపది ముర్ము. ఈ పరేడ్‌లో గ్రాడ్యుయేట్ అయిన వారి నుంచి గౌరవ వందనం స్వీకరించనున్నారు రాష్ట్రపతి ముర్ము. అనంతరం వారిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
#WATCH | Combined Graduation Parade underway at the Air Force Academy in Dundigal, Telangana
ఇక ఇకపోతే, పరేడ్‌కి రివ్యూయింగ్ అధికారిగా రాష్ట్రపతి వ్యవహరించడం ఎయిర్ ఫోర్స్ అకాడమీ చరిత్రలో ఇది మొదటి సారి. రాష్ట్రపతి ముర్ముతోపాటే గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ సీఎస్ శాంత కుమారి హాజరుకానున్నారు.