RBI: గరిష్ట బ్యాంకు బ్యాలెన్స్‌పై ఆర్‌బీఐ కొత్త నిబంధన!! అసలు విషయం ఏంటంటే..

మీ బ్యాంకు ఖాతాలో రూ.30 వేల కంటే ఎక్కువ ఉంటే దాన్ని మూసివేయాల్సి ఉంటుందని మెసేజ్‌లో పేర్కొన్నారు. బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్‌కి సంబంధించి ఈ వైరల్ మెసేజ్ వెనుక వాస్తమెంటో ఇక్కడ తెలుసుకుందాం..

RBI:  గరిష్ట బ్యాంకు బ్యాలెన్స్‌పై ఆర్‌బీఐ కొత్త నిబంధన!! అసలు విషయం ఏంటంటే..
RBI
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 17, 2023 | 8:19 AM

బ్యాంకింగ్ కార్యకలాపాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు అనేక మార్గదర్శకాలను జారీ చేస్తుంది. KYC, PAN – Aadhaar లింక్ వంటి బ్యాంక్ ఖాతాకు సంబంధించిన అవసరమైన సూచనలను RBI ఎప్పటికప్పుడు జారీ చేస్తుంది. అయితే తాజాగా RBI కి సంబంధించినట్టుగా ఓ మెసేజ్‌ వైరల్‌ అవుతోంది. అది బ్యాంకు ఖాతాకు సంబంధించిన సందేశం. అంటే గరిష్ఠ బ్యాంకు బ్యాలెన్స్ కు సంబంధించి ఆర్బీఐ కొత్త రూల్ ను ప్రకటించినట్లుగా ఒక వార్త హల్‌చల్‌ చేస్తోంది. అలా వైరల్ అవుతున్న ఆ సందేశం ప్రకారం, RBI గవర్నర్ శక్తికాంత దాస్ గరిష్ట బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం కోసం కొత్త నియమాన్ని ప్రకటించారు. మీ బ్యాంకు ఖాతాలో రూ.30 వేల కంటే ఎక్కువ ఉంటే దాన్ని మూసివేయాల్సి ఉంటుందని మెసేజ్‌లో పేర్కొన్నారు. బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్‌కి సంబంధించి ఈ వైరల్ మెసేజ్ వెనుక వాస్తమెంటో ఇక్కడ తెలుసుకుందాం..

కస్టమర్ల బ్యాంక్ బ్యాలెన్స్‌కు సంబంధించి ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ కొత్త నిబంధనలను ప్రకటించారని, మీ అకౌంట్‌లో బ్యాలెన్స్ రూ. 30,000 కంటే ఎక్కువ ఉంటే మీ ఖాతా క్లోజ్‌ చేయబడుతుందనేది ఆ వైరల్‌ వార్త చెబుతున్న సందేశం..కానీ, అసలు విషయం ఏంటంటే.. PIB వాస్తవ తనిఖీలో ఈ సందేశం పూర్తిగా నకిలీదని తేలింది. ఆర్‌బీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పీఐబీ స్పష్టం చేసింది.

“రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ బ్యాంక్ ఖాతాలకు సంబంధించి ఎవరైనా ఖాతాదారుడు తన ఖాతాలో రూ. 30,000 కంటే ఎక్కువ ఉన్నట్లయితే ఆ అకౌంట్‌ క్లోజ్‌ చేస్తారనేది పూర్తిగా అవాస్తవమని, RBI అటువంటి నిర్ణయం తీసుకోలేదని PIB ట్వీట్ చేసింది.

ఇవి కూడా చదవండి

PIBతో సందేశాలను వాస్తవంగా ఎలా తనిఖీ చేయాలి..

మీకు ఏదైనా అనుమానాస్పద సందేశం వస్తే, మీరు దాని ప్రామాణికతను తనిఖీ చేయవచ్చు. వార్త నిజమా లేదా నకిలీ వార్తా అని తనిఖీ చేయవచ్చు. ఇలాంటి ఫేక్ న్యూస్‌లకు దూరంగా ఉండాలని, ఈ వార్తలను ఎవరితోనూ పంచుకోవద్దని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఇలాంటి వార్తలను ఎవరితోనూ షేర్ చేయవద్దని, వైరల్ మెసేజ్ ఏదైనా నిజమో తెలియాలంటే ఈ మొబైల్ నంబర్ 918799711259కు వాట్సాప్ మెసేజ్ పంపవచ్చు. లేదా socialmedia@pib.gov.inకు మెయిల్ చేయండి అని PIB తెలియజేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..