Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పార్కింగ్‌ పరేషాన్‌..! జరిమానా కట్టలేక కార్లను బిల్డింగ్‌ ఎక్కించేశాడు.. అదేలాగో తెలిస్తే అవాక్కే..!!

పెరిగిపోయిన వాహనాలతో పాటే వాటిని పార్క్‌ చేయటం కూడా తలకు మించిన భారంగానే మారుతోంది. ఈ సమస్య ఒక్క మన దేశం, రాష్ట్రంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా వాహనదారులు ఎదుర్కొంటున్నదే. అయితే, ఎక్కడపడితే, అక్కడ వాహనాలను పార్క్‌ చేస్తే జరిమానా కట్టాల్సిన పరిస్థితులు కూడా ఎదురవుతున్నాయి. ఇక మనదేశంలో ఎవరి వాహనాలను వారు తమ ఇంటి ముందు పార్క్‌ చేస్తుంటారు. ఇది భారతదేశంలో సర్వసాధారణం. కానీ

పార్కింగ్‌ పరేషాన్‌..! జరిమానా కట్టలేక కార్లను బిల్డింగ్‌ ఎక్కించేశాడు.. అదేలాగో తెలిస్తే అవాక్కే..!!
Car Parking On Rooftop
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 16, 2023 | 2:11 PM

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా రవాణా వ్యవస్థ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో వాహనాల సంఖ్య కూడా భారీగా పెరగిపోతోంది. ఒక రకంగా చెప్పాలంటే మనుషుల కంటే వాహనాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రతి ఇంటికి కారు, బైక్‌ తప్పనిసరిగా మారింది. అంతేకాదు.. పెరిగిపోయిన వాహనాలతో పాటే వాటిని పార్క్‌ చేయటం కూడా తలకు మించిన భారంగానే మారుతోంది. ఈ సమస్య ఒక్క మన దేశం, రాష్ట్రంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా వాహనదారులు ఎదుర్కొంటున్నదే. అయితే, ఎక్కడపడితే, అక్కడ వాహనాలను పార్క్‌ చేస్తే జరిమానా కట్టాల్సిన పరిస్థితులు కూడా ఎదురవుతున్నాయి. ఇక మనదేశంలో ఎవరి వాహనాలను వారు తమ ఇంటి ముందు పార్క్‌ చేస్తుంటారు. ఇది భారతదేశంలో సర్వసాధారణం. కానీ చైనాలో ఇలా చేస్తే జరిమానా విధిస్తారు. తైవాన్‌కు చెందిన ఒక వ్యక్తి తన కారును సరైన స్థలంలో పార్క్ చేయనందుకు జరిమానా చెల్లించాల్సి వచ్చినందుకు అతడు షాక్ అయ్యాడు. జరిమానాలు చెల్లించలేక అతడు..ఏం చేశాడో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

తైవాన్‌లో ఒక వ్యక్తి ఇంటి బయట కారును పార్క్ చేసినందుకు వ్యక్తి జరిమానా చెల్లించాల్సి వచ్చింది. దీంతో విసిగిపోయిన అతడు తన కారును రూఫ్‌పై పార్క్‌ చేయాలని నిర్ణయించుకున్నాడు. అది సాధ్యం కాదని అందరూ చెప్పినప్పటికీ అతడు వినలేదు.. తన నిర్ణయం నుండి వెనక్కి తగ్గలేదు. ఎలాగోలా అతడు తన కారును ఇంటిపైకి ఎక్కించేశాడు. ఈ ఘటనకు సంబంధించిన రెండు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైరల్ అవుతున్న ఫోటోలో ఒకే ఇంటి పైకప్పుపై 2 కార్లు పార్క్‌ చేసి కనిపిస్తున్నాయి. అందులో మొదటి కారు చిన్న ప్రదేశానికి సరిపోతుంది. కానీ మరో కారుకు స్థలం లేకపోవడంతో దానిని అలాగే ఉంచారు. కారు వెనుక భాగం పైకప్పు నుండి వేలాడుతూ కనిపించింది. ఇక, ఇలా కారును రూఫ్‌పై పార్క్ చేసినా భవనానికి ఎలాంటి నష్టం వాటిల్లదని ఆ వ్యక్తి చెప్పారు. ఎందుకంటే ఇది కాంక్రీట్-ఉక్కుతో నిర్మించినట్టుగా చెప్పారు.. ఇది వాహనాల భారాన్ని మోయగలదని చెప్పారు.

ఇరుగుపొరుగు వారు ఫిర్యాదు చేయడంతో వాహనాన్ని దించాలని నిర్వాహకులు ఆ వ్యక్తిని కోరారు. అయితే తాను ఏ నిబంధనను ఉల్లంఘించలేదని అన్నాడు. కానీ, స్థానికులు, అధికారుల మాట మేరకు అతడు చివరికి రెండు కార్లను కిందకు దించారు. కానీ, ఆ వ్యక్తి రెండు కార్లను రూఫ్‌పై ఎలా పార్క్ చేసాడు..? అన్నది మీకు సందేహంగా ఉందికదా..? ఇందుకోసం అతడు క్రేన్ సాయం తీసుకున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..