రష్యన్ మనిషిని తిన్న షార్క్.. ఈజిప్ట్‌ మ్యూజియంలో మమ్మీగా మారింది.. ఎందుకంటే..

ఈ విషాద ఘటనతో అక్కడి పర్యాటకులు సైతం నిర్ఘంతపోయారు. ఉప్పెనల ఎగిసిపడుతున్న దుఖంతోనే ఆ తండ్రి తన కొడుకు మృతదేహాన్ని రష్యాకు తీసుకెళ్తానని అభ్యర్థించాడు. ఇటీవల కాలంలో ఈ బీచ్‌లో షార్క్‌ల దాడులు సర్వసాధారణంగా మారిపోయాయంటున్నారు స్థానికులు, దీంతో స్థానికులు, పర్యాటకుల్లో భయం నెలకొంది.

రష్యన్ మనిషిని తిన్న షార్క్.. ఈజిప్ట్‌ మ్యూజియంలో మమ్మీగా మారింది.. ఎందుకంటే..
Shark
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 16, 2023 | 1:19 PM

ఓ తండ్రీకొడుకులు సముద్రంలో ఈత కొడుతుండగా ఉన్నట్టుండి ఒక షార్క్ వారిపై దాడి చేసింది. తండ్రి కళ్లముందే కుమారుడిపై దాడి చేసి లాక్కెళ్లింది. మొసలి నోటికి చిక్కి క్షణాల్లో ప్రాణాలు కోల్పోయిన కొడుకు మృతదేహాన్ని చూసి ఆ తండ్రి తల్లడిల్లిపోయాడు. సముద్ర తీరంలోనే కుప్పకూలిపోయాడు. కొడుకును తలచుకుని కన్నీరుమున్నీరయ్యాడు. ఈజిప్టును సందర్శించేందుకు వచ్చిన రష్యా కుటుంబంలో జరిగింది ఈ విషాద సంఘటన. ఈ దారుణ ఘటన తర్వాత ఈజిప్టు అధికారులు ఆ షార్క్‌ను పట్టుకున్నారు.. ఆ తర్వాత షార్క్‌ను మమ్మీ చేసి మ్యూజియంలో ఉంచినట్లు సమాచారం.

ఈ సంఘటన ఈజిప్టులో జరిగింది. ఇటీవల ఒక రష్యన్ కుటుంబం ఈజిప్టు సందర్శనకు వచ్చింది. సంతోషంగా సాగిన వీరి విహార యాత్రలో తమ కొడుకు మృతి వారి కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటన అనంతరం అక్కడి అధికారులు.. ఆ షార్క్‌ను పట్టి చంపేశారని తెలిసింది. ఆ తర్వాత షార్క్‌ పొట్టలోంచి శరీరా భాగాలను వెలికితీశారు. ఆ తర్వాత షార్క్‌ శరీరాన్ని మమ్మీ చేసి ఈజిప్షియన్ మ్యూజియంలో ఉంచినట్టుగా సమాచారం. షార్క్ ఎందుకు అలా ప్రవర్తించింది? అనే కారణాలను గుర్తించేందుకే పరిశోధకులు షార్క్‌ను భద్రపరిచారని చెప్పారు.

అయితే, ఆ రోజున 23 ఏళ్ల వ్లాదిమిర్ పోపోవ్ ఈజిప్టులోని హుర్ఘాడా సముద్రంలో పడిపోయాడు. జల్కెలి వీడియో షూట్ కోసం తలపై ఆధునిక గ్రో ప్రో కెమెరా కూడా ఉంది. తమ చుట్టుపక్కలే షార్క్ ఉందని ఒక్క క్షణం కూడా వారు గుర్తించలేదని పోపోవ్ తండ్రి తెలిపారు. సంతోషంగా సముద్రంలో ఎంజాయ్‌ చేస్తున్న సమయం ఇంత భయంకరంగా మారుతుందని కొద్ది క్షణాలు ఆలస్యంగా అర్థమైంది. రెప్పపాటు సమయంలోనే ఆ షార్క్ వ్లాదిమిర్‌పై దాడి చేసిందని చెప్పారు. దాదాపు రెండు గంటలపాటు వెతికిన తర్వాత షార్క్ దొరికింది. తరువాత, వ్లాదిమిర్ శరీర భాగాలను దాని పొట్టలో గుర్తించారు. వాటిని అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ విషాద ఘటనతో అక్కడి పర్యాటకులు సైతం నిర్ఘంతపోయారు. ఉప్పెనల ఎగిసిపడుతున్న దుఖంతోనే ఆ తండ్రి తన కొడుకు మృతదేహాన్ని రష్యాకు తీసుకెళ్తానని అభ్యర్థించాడు. ఇటీవల కాలంలో ఈ బీచ్‌లో షార్క్‌ల దాడులు సర్వసాధారణంగా మారిపోయాయంటున్నారు స్థానికులు, దీంతో స్థానికులు, పర్యాటకుల్లో భయం నెలకొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

పుష్పాగాడి రూల్.. 2000 కోట్ల క్లబ్ లో పుష్ప 2.! బన్నీ మార్క్ సెట్
పుష్పాగాడి రూల్.. 2000 కోట్ల క్లబ్ లో పుష్ప 2.! బన్నీ మార్క్ సెట్
ఇకపై గంటలో తిరుమల వెంకన్న దర్శనం.. ఎలాగంటే?
ఇకపై గంటలో తిరుమల వెంకన్న దర్శనం.. ఎలాగంటే?
మీరు కారును అమ్ముతున్నారా? ముందు ఇది చేయండి.. లేకుంటే కోర్టుకే..
మీరు కారును అమ్ముతున్నారా? ముందు ఇది చేయండి.. లేకుంటే కోర్టుకే..
ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు ? స్నానం, దానం శుభ సమయం ఎప్పుడంటే
ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు ? స్నానం, దానం శుభ సమయం ఎప్పుడంటే
ఆ వ్యాన్‌లో ఉన్నది ఫర్నీచర్ కాదు గురూ..!
ఆ వ్యాన్‌లో ఉన్నది ఫర్నీచర్ కాదు గురూ..!
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్