Sprouted Garlic : మొలకెత్తిన వెల్లుల్లితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా..? వయసు తగ్గిపోతుంది..!

అయితే, ఈ వెల్లుల్లిని నేరుగా తినడం కంటే వాటిని మొలకెత్తించి తినడం వల్ల రెట్టింపు స్థాయిలో మనకు పోషకాలు లభిస్తాయని చెబుతున్నారు. మొలకెత్తిన వెల్లుల్లిని తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Sprouted Garlic : మొలకెత్తిన వెల్లుల్లితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా..? వయసు తగ్గిపోతుంది..!
Sprouted Garlic 3
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 16, 2023 | 11:44 AM

మొలకెత్తిన విత్తనాలు, పండ్లు, కూరగాయలు తినడం గురించి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మొలకెత్తిన విత్తనాలు, పండ్లు, కూరగాయలు తినడం ఆరోగ్యానికి హానికరం అని కొందరు అంటారు. అయితే ఈ అభిప్రాయం తప్పని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మొలకెత్తిన పప్పులు, పండ్లు, కూరగాయలు ఆరోగ్యానికి మంచివని చెబుతున్నారు. ఇందులో మొలకెత్తిన వెల్లుల్లి కూడా ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు కలిగిస్తుంది. వెల్లుల్లి రెబ్బలను ప్రతిరోజూ ఆహారంలో ఒక భాగంగా చేసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని మన అందరికీ తెలిసిందే. అయితే, ఈ వెల్లుల్లిని నేరుగా తినడం కంటే వాటిని మొలకెత్తించి తినడం వల్ల రెట్టింపు స్థాయిలో మనకు పోషకాలు లభిస్తాయని చెబుతున్నారు. మొలకెత్తిన వెల్లుల్లిని తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

అసమతుల్య ఆహారం, సరైన జీవనశైలి కారణంగా లక్షలాది మంది క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల బారిన పడుతున్నారు. మొలకెత్తిన వెల్లుల్లిని తీసుకోవడం క్యాన్సర్‌ను నివారించడంలో చాలా ప్రయోజనకరంగా చెబుతారు. మొలకెత్తిన వెల్లులిని రోజూ తీసుకోవడం వల్ల క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. మొలకెత్తిన వెల్లుల్లిని రోజూ తీసుకోవడం వల్ల గుండె జబ్బులు తగ్గుతాయి. మొలకెత్తిన వెల్లుల్లిలో ఉండే ఎంజైమ్‌లు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. దీంతో హార్ట్ బ్లాక్ సమస్యను నివారించుకోవచ్చు. మొలకెత్తిన వెల్లుల్లి తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వెల్లుల్లిలోని యాంటీ ఆక్సిడెంట్లు మీ శరీర రోగ నిరోధక శక్తిని పెంచేందుకు పని చేస్తాయి.

వెల్లుల్లిలో రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించే ఎంజైములు పుష్కలంగా ఉంటాయి. మొలకెత్తిన వెల్లుల్లిలో ఇది పుష్కలంగా ఉంటుంది. రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది. జర్నల్ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ ఫుడ్ కెమిస్ట్రీలో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, ఐదు రోజుల పాటు మొలకెత్తిన వెల్లుల్లి పాయలలో అత్యధిక యాంటీఆక్సిడెంట్ కంటెంట్ ఉంటుంది. ఇది మీరు ఎదుర్కొంటున్న అకాల వృద్ధాప్యాన్ని అడ్డుకుంటుంది. మీరు యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.

ఇవి కూడా చదవండి

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

పండగే పండగ.. ఇంటర్ విద్యార్థులకు సంక్రాంతి సెలవులు ఎన్నిరోజులంటే
పండగే పండగ.. ఇంటర్ విద్యార్థులకు సంక్రాంతి సెలవులు ఎన్నిరోజులంటే
చికెన్ సాంబార్ ఒక్కసారి ఇంట్లో చేయండి.. ఎందులోకైనా అదుర్స్!
చికెన్ సాంబార్ ఒక్కసారి ఇంట్లో చేయండి.. ఎందులోకైనా అదుర్స్!
శని ప్రదోష వ్రతం రోజున ఈ పని చేయండి ఆర్థికంగా లాభాలు అందుకుంటారు
శని ప్రదోష వ్రతం రోజున ఈ పని చేయండి ఆర్థికంగా లాభాలు అందుకుంటారు
ప్రాణంగా ప్రేమిస్తే వదిలేసింది
ప్రాణంగా ప్రేమిస్తే వదిలేసింది
మతిపోగొట్టే ప్లాన్‌.. రూ.321కే ఏడాది వ్యాలిడిటీ.. ఎవరికో తెలుసా?
మతిపోగొట్టే ప్లాన్‌.. రూ.321కే ఏడాది వ్యాలిడిటీ.. ఎవరికో తెలుసా?
ఈ సీజన్‌లో జీడిపప్పు తింటే ఇన్ని లాభాలు ఉన్నాయా..
ఈ సీజన్‌లో జీడిపప్పు తింటే ఇన్ని లాభాలు ఉన్నాయా..
దుబాయ్‌ కారు రేసులో ప్రమాదం.. హీరో అజిత్‌‌కు గాయాలు
దుబాయ్‌ కారు రేసులో ప్రమాదం.. హీరో అజిత్‌‌కు గాయాలు
ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభం..
ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభం..
నిమ్మ కాయను నేరుగా అప్లై చేస్తే చర్మానికి ఎంత హానికరమో తెలుసా
నిమ్మ కాయను నేరుగా అప్లై చేస్తే చర్మానికి ఎంత హానికరమో తెలుసా
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2025: మీరు తెలుసుకోవాల్సిన కీలక అంశాలు..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2025: మీరు తెలుసుకోవాల్సిన కీలక అంశాలు..