Health Tips: వేసవిలో ఇది మీ ఆరోగ్యానికి సంజీవని.. పచ్చిగా తిన్నా అద్భుత ప్రయోజనాలు
దీనితో పాటు, ముల్లంగిని మీ ఆహారంలో చేర్చుకోవటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. బీపీ, ఇన్‌ఫెక్షన్ వంటి సమస్యలతో భాదపడేవారు ముల్లంగి తింటే ఆయా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే లివర్‌లో ఉండే విష పదార్థాలను ముల్లంగి బయటకు తరిమికొడుతుంది.
పండ్లు, పచ్చి కూరగాయలను ఆహారంలో చేర్చుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. టమోటాలు, దోసకాయలు, క్యారెట్లు, ముల్లంగి వంటి కూరగాయలు, పండ్లు తినడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అలాంటి పచ్చి కూరగాయల్లో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు కలిగింది ముల్లంగి. ముల్లంగిని చలికాలంలో మాత్రమే కాదు.. ఈ వేడి వేసవి కాలంలో కూడా తినవచ్చు. ముల్లంగి ఒక పచ్చి కూరగాయ, ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వేసవిలో ఈ కూరగాయ తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ముల్లంగి తినడం వల్ల మన శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. ముల్లంగిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి కూడా రక్షిస్తుంది.
ముల్లంగిని తీసుకోవడం వల్ల మీ జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. అసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలను నయం చేయడంలో సహాయపడుతుంది. కాబట్టి మీరు ముల్లంగిని సలాడ్ రూపంలో మీ ఆహారంలో చేర్చుకోవటం ఉత్తమం. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఆంథోసైనిన్ అనే ఫ్లేవనాయిడ్ మూలాల్లో ఎక్కువగా ఉంటుంది. ఇది గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ముల్లంగి కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో కూడా మేలు చేస్తుంది. దీనితో పాటు, ముల్లంగిని మీ ఆహారంలో చేర్చుకోవటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. బీపీ, ఇన్‌ఫెక్షన్ వంటి సమస్యలతో భాదపడేవారు ముల్లంగి తింటే ఆయా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే లివర్‌లో ఉండే విష పదార్థాలను ముల్లంగి బయటకు తరిమికొడుతుంది.
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం..