Bonalu Festival: జూన్ 22 నుంచి బోనాల పండుగ.. ముస్తాబవుతున్న హైదరాబాద్‌..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాల పండుగను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సం బోనాల పండుగకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ యేడు ఆషాడమాస బోనాలకు హైదరాబాద్ మహానగరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. నగరంలోని ప్రధాన అమ్మవారి ఆలయాలను

Bonalu Festival: జూన్ 22 నుంచి బోనాల పండుగ.. ముస్తాబవుతున్న హైదరాబాద్‌..
Ashada Bonalu
Follow us

|

Updated on: Jun 16, 2023 | 11:15 AM

తెలంగాణలో చారిత్రక ప్రసిద్ధిగాంచిన ఉత్సవం లష్కర్‌ బోనాల జాతర. ప్రతీయేటా ఆషాడమాసంలో అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ప్రజలు పండగ చేస్తుంటారు. ముఖ్యంగా సికింద్రాబాద్, హైదరాబాద్ జంట నగరాల్లో బోనాల పండుగ చాలా ఘనంగా జరుపుకుంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాల పండుగను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సం బోనాల పండుగకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ యేడు ఆషాడమాస బోనాలకు హైదరాబాద్ మహానగరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. నగరంలోని ప్రధాన అమ్మవారి ఆలయాలను సమీక్షించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏర్పాట్లపై అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.

జూన్ 19 నుంచి 21 వరకు బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం జరుగనుంది. అనంతరం 22వ తేదీ నుంచి జులై 20 వరకు భాగ్యనగరంలో ఆషాడమాస బోనాల ఉత్సవాలు జరుగనున్నాయి. ఈనెల 22న గోల్కొండ జగదాంబిక అమ్మవారికి రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో తొలిబోనం సమర్పించనున్నారు. జులై 9న సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి జాతర, జూలై 10న రంగం కార్యక్రమం ఉంటుంది.

జులై 16న లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారికి బోనాలు జరుగనున్నాయి. జులై 20న చివరి బోనంతో నగరంలో బోనాల ఉత్సవాలు ముగియనున్నాయి. ఈ పండుగకు రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్ల నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

అక్టోబర్ నెలలో వారి జీవితాల్లో సరికొత్త సంచలనాలు..
అక్టోబర్ నెలలో వారి జీవితాల్లో సరికొత్త సంచలనాలు..
ఈసమయంలో మీపూర్వీకులు కలలోకి వస్తున్నారా మంచి, చెడు సూచనలు ఏమిటంటే
ఈసమయంలో మీపూర్వీకులు కలలోకి వస్తున్నారా మంచి, చెడు సూచనలు ఏమిటంటే
దేవరలో సైఫ్ వైఫ్‌గా నటించింది ఎవరో తెల్సా.. బుల్లితెరపై ఫేమస్
దేవరలో సైఫ్ వైఫ్‌గా నటించింది ఎవరో తెల్సా.. బుల్లితెరపై ఫేమస్
పాదాల్లో వాపు తగ్గాలంటే ఈ హోమ్ రెమిడీస్ బెస్ట్!
పాదాల్లో వాపు తగ్గాలంటే ఈ హోమ్ రెమిడీస్ బెస్ట్!
టేస్టీ టేస్టీ బ్రెడ్ చిల్లీ.. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి!
టేస్టీ టేస్టీ బ్రెడ్ చిల్లీ.. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి!
సూర్య గ్రహణంతో వారికి అంతా శుభమే! మీ రాశికి ఎలా ఉందంటే..
సూర్య గ్రహణంతో వారికి అంతా శుభమే! మీ రాశికి ఎలా ఉందంటే..
టేస్టీ టేస్టీ చికెన్ కబాబ్స్.. తింటే వావ్ అనక తప్పదు..
టేస్టీ టేస్టీ చికెన్ కబాబ్స్.. తింటే వావ్ అనక తప్పదు..
ఎక్కువ మంది భారతీయులు సందర్శించడానికి వెళ్ళే చౌకైన దేశాలు ఏమిటంటే
ఎక్కువ మంది భారతీయులు సందర్శించడానికి వెళ్ళే చౌకైన దేశాలు ఏమిటంటే
పింఛన్‌దారులకు శుభవార్త.! ఇకపై ఇంటి నుంచే లైఫ్‌ సర్టిఫికెట్‌..
పింఛన్‌దారులకు శుభవార్త.! ఇకపై ఇంటి నుంచే లైఫ్‌ సర్టిఫికెట్‌..
తిరుపతి లడ్డూ కల్తీపై ఘాటుగా స్పందించిన ఖుష్బూ
తిరుపతి లడ్డూ కల్తీపై ఘాటుగా స్పందించిన ఖుష్బూ