Drugs Case: టాలీవుడ్‌లో టెన్షన్.. కేపీ చౌదరి కాంటాక్ట్స్ లిస్టులో పలువురు సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సినీ డ్రగ్స్ కేసులో పోలీసులు కూపీ లాగుతున్నారు. కబాలీ తెలుగు నిర్మాత కేపీ చౌదరి కస్టడీ కోసం పోలీసులు ఎదురుచూపులు చూస్తున్నారు. కేపీని వారం రోజుల కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై నేడు విచారణ కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సినీ డ్రగ్స్ కేసులో పోలీసులు కూపీ లాగుతున్నారు. కబాలీ తెలుగు నిర్మాత కేపీ చౌదరి కస్టడీ కోసం పోలీసులు ఎదురుచూపులు చూస్తున్నారు. కేపీని వారం రోజుల కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై నేడు విచారణ కొనసాగుతోంది. అయితే కేపీ లిస్టులో సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇటీవల డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన ప్రొడ్యూసర్ కం డిస్ట్రిబ్యూటర్ కేపీ చౌదరి ఫోన్ లో వందల కొద్ది కాంటాక్ట్స్ ఉన్నట్లు సమాచారం. సినీ పరిచయాలు కారణంగా కేపీ ఫోన్ కాంటాక్ట్స్ లో అధికంగా ప్రముఖులు నెంబర్ల ఉన్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలో కేపీతో డ్రగ్స్ లింక్స్ ఉన్న సినీ తారలను గుర్తిస్తామంటున్నారు పోలీసులు. కేపీ ఇచ్చే సమాచ్చారంతో సినీ తారలు, వ్యాపారవేత్తల డ్రగ్స్ బాగోతాలు బయటపడతాయని సైబరాబాద్ పోలీసులు చెబుతున్నారు.. ఇక డ్రగ్ కేస్ లో ఏ 1 గా రాకేష్ రోషన్ కు సైతం స్టార్స్ తో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా రాకేష్, కేపీ పలు పార్టీల్లో డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరో వైపు నైజీరియన్ గాబ్రియేల్ కోసం వేట కొనసాగుతోంది. నైజీరియన్ గాబ్రియేల్ నుండే అధిక శాతం హైదరాబాద్ లోకి డ్రగ్స్ ఎంటరవుతున్నట్లు తెలుస్తుంది. గాబ్రియేల్‌పై ఇప్పటికే అనేక కేసులు నమోదైనట్లు తెలుస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..