పవన్ హీరోయిజం జీరోయిజానికి పడిపోతోంది.. సీఎంగా ఛాన్స్ ఇవ్వాలన్న జనసేన అధినేత వ్యాఖ్యలపై ఆర్జీవీ సెటైర్లు
ముఖ్యమంత్రిగా ఒక్కసారి అవకాశం ఇవ్వాలంటూ జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సెటైర్లు వేశారు. ట్విట్టర్ వేదికగా 'పవర్ స్టార్ కన్నీళ్ళతో ఒక్క ఛాన్స్ అంటూ అడుక్కుంటున్నారు. అభిమానులు, కులస్థుల దృష్టిలో ఆయన హీరోయిజం జీరోయిజానికి తగ్గిపోతుంది..

ముఖ్యమంత్రిగా ఒక్కసారి అవకాశం ఇవ్వాలంటూ జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సెటైర్లు వేశారు. ట్విట్టర్ వేదికగా ‘పవర్ స్టార్ కన్నీళ్ళతో ఒక్క ఛాన్స్ అంటూ అడుక్కుంటున్నారు. అభిమానులు, కులస్థుల దృష్టిలో ఆయన హీరోయిజం జీరోయిజానికి తగ్గిపోతుంది అంటూ ట్వీట్ చేశారు ఆర్జీవీ. కాగా జనసేన అధినేత పవన్ ప్రస్తుతం వారాహి యాత్రలో బిజీగా ఉంటున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం (జూన్ 15) చేబ్రోలు సభలో ఆసక్తికర కామెంట్లు చేశారు పవన్. ‘అసెంబ్లీకి పంపండి. ముఖ్యమంత్రిగా ఒక్క ఛాన్స్ ఇవ్వండి’ అంటూ ప్రజలను అభ్యర్థించారు పవన్. ఇప్పుడీ వ్యాఖ్యలపైనే కౌంటర్ వేశాడు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.
ఈ నేపథ్యంలో పవన్ కామెంట్స్‌కి వైసీపీ నుంచి కౌంటర్లు పడుతున్నాయ్. పవన్ కల్యాణ్‌పై ఒక రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు వైసీపీ లీడర్స్. అదే సమయంలో డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ సెటైరికల్‌గా కామెంట్లు చేశారు. పవన్ హీరోయిజం జీరోయిజానికి తగ్గిపోతుందంటూ విమర్శలు చేశారు. ఇప్పుడే కాదు ఇటీవల టీడీపీ, జనసేన పార్టీలపై తరచూ విమర్శలు, సెటైర్లు వేస్తున్నారు వర్మ. చంద్రబాబు, పవన్, లోకేశ్‌లను లక్ష్యంగా చేసుకుని ట్విట్టర్ వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల నారా లోకేశ్ యువగళం పాదయాత్రపై స్పందిస్తూ’ ఆస్కార్ ఇవ్వాల్సింది ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు కాదు.. నారా లోకేశ్‌కు ‘ అని కామెంట్ చేశారు వర్మ.




POWER STAR BEGGING with TEARS for ONE CHANCE is making his HEROISM into ZEROISM in the hearts of both his FANS and CASTE
— Ram Gopal Varma (@RGVzoomin) June 16, 2023
And the OSCAR goes to not #RRR , not to @ssrajamouli , not to @mmkeeravaani not to @AlwaysRamCharan , not to @tarak9999 ..IT GOES TO @naralokesh ??????? pic.twitter.com/dctyNTEAdq
— Ram Gopal Varma (@RGVzoomin) June 14, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..