Sreeleela: రష్మిక మందన్న బాటలోనే శ్రీలీల.. ఈ బ్యూటీ కూడా అదే పని చేస్తుందా..?

శ్రీలీల కూడా మన దగ్గర బిజీ హీరోయిన్ గా మారిపోయింది. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణ లో తెరకెక్కిన పెళ్ళిసందడి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ బ్యూటీ.

Sreeleela: రష్మిక మందన్న బాటలోనే శ్రీలీల.. ఈ బ్యూటీ కూడా అదే పని చేస్తుందా..?
Rashmika, Sreeleela
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 16, 2023 | 10:21 AM

శ్రీలీల ఇప్పుడు టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తున్న పేరు ఇది. ఇప్పటికే కన్నడ ఇండస్ట్రీ నుంచి రష్మిక టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ హోదాను సొంతం చేసుకుంది. ఇప్పుడు అదే ఇండస్ట్రీ నుంచి వచ్చిన శ్రీలీల కూడా మన దగ్గర బిజీ హీరోయిన్ గా మారిపోయింది. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణ లో తెరకెక్కిన పెళ్ళిసందడి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. తొలి సినిమాతోనే అందం, అభినయం, చలాకీ తనంతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ ఈ అమ్మడికి మాత్రం మంచి పేరు వచ్చింది. పెళ్ళిసందడి సినిమా తర్వాత వెంటనే మాస్ రాజా రవితేజ తో కలిసి ధమాకా సినిమా చేసింది ఈ బ్యూటీ. ధమాకా సినిమా మంచి విజయం సాధించడంతో.. ఈ అమ్మడికి అవకాశాలు క్యూ కట్టాయి.

ఇక ఇప్పుడు ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో ఛాన్స్ అందుకుంది ఈ అమ్మడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమాలో అవకాశం దక్కించుకుంది ఈ భామ. అలాగే బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాలో నటిస్తోంది. అలాగే యంగ్ హీరోల సినిమాల్లోనూ నటిస్తోంది.

నితిన్ 32, వైష్ణవ్ తేజ్ ఆదికేశవ, పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, రామ్ పోతినేని బోయపాటి సినిమాల్లో నటిస్తుంది. ఇదిలా ఉంటే వరుస సినిమాలు చేస్తున్న ఈ చిన్నది. బాలీవుడ్ కు చెక్కేస్తోందా అన్న అనుమానాలు మొదలయ్యాయి అభిమానుల్లో.. ఎందుకంటే ఇలా కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన రష్మిక కూడా టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూనే బాలీవుడ్ లో కూడా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే రష్మిక అక్కడ పలు సినిమాల్లో నటించింది. అలాగే శ్రీలీల కూడా బాలీవుడ్ కు వెళ్తుందా.? అన్నది చూడాలి.