Prabhas: నువ్వు దేవుడివి సామీ.. ‘సలార్‌’ యూనిట్‌ సభ్యులందరికీ ప్రభాస్‌ కానుక.. ఒక్కొక్కరికి ఏకంగా..

ప్రభాస్‌ అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఆదిపురుష్‌ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. వారి నిరీక్షణ మరి కొన్ని గంటల్లో తీరనుంది. సినిమాల సంగతి పక్కన పెడితే.. వ్యక్తిగతంగానూ ప్రభాస్‌ అంటే చాలామందికి ఇష్టం. దానికి కారణమేంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన అభిమానులకు ఎంతో ప్రాధాన్యమిచ్చే డార్లింగ్ తన అవసరం ఉన్నప్పుడు తప్పక సాయ పడుతుంటారు.

Prabhas: నువ్వు దేవుడివి సామీ.. 'సలార్‌' యూనిట్‌ సభ్యులందరికీ ప్రభాస్‌ కానుక.. ఒక్కొక్కరికి ఏకంగా..
Prabhas
Follow us
Basha Shek

|

Updated on: Jun 15, 2023 | 4:46 PM

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ నటించిన ది మోస్ట్‌ అవైటెడ్‌ మూవీ ‘ఆదిపురుష్‌’ మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. రామాయణం మహాకావ్యం ఆధారంగా రూపొందిన ఈ మైథలాజికల్‌ మూవీలో రాముడిగా కనిపించనున్నారు. జానకి పాత్రలో కృతిసనన్‌, రావణాసురుడి పాత్రలో సైఫ్‌ అలీఖాన్‌ నటించారు. ప్రభాస్‌ అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఆదిపురుష్‌ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. వారి నిరీక్షణ మరి కొన్ని గంటల్లో తీరనుంది. సినిమాల సంగతి పక్కన పెడితే.. వ్యక్తిగతంగానూ ప్రభాస్‌ అంటే చాలామందికి ఇష్టం. దానికి కారణమేంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన అభిమానులకు ఎంతో ప్రాధాన్యమిచ్చే డార్లింగ్ తన అవసరం ఉన్నప్పుడు తప్పక సాయ పడుతుంటారు. ఇక సినిమా సభ్యులకు ఇంటి భోజనం తెప్పించడం, బహుమతులు ఇవ్వడం వంటివి చేస్తూ తన మంచి మనును చాటుకున్నారు. ఇక రాధేశ్యామ్ సినిమా షూటింగ్ ముగిశాక చిత్రబృందంలోని వారందరికీ ఓ ప్రముఖ కంపెనీ వాచీలు కానుకగా ఇచ్చారు. తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు ప్రభాస్‌.

డార్లింగ్‌ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా సలార్‌ షూటింగ్‌ ఆఖరి దశకు చేరుకుంది. ఈక్రమంలో సలార్‌ మూవీ కోసం పనిచేస్తున్న టీం సభ్యులందరి ఖాతాలో రూ. 10 వేలు జమ చేశారట ప్రభాస్‌. పాన్ ఇండియా సినిమా కోసం యూనిట్‌ సభ్యులంతా రేయింబవళ్లు శ్రమించారని, అందుకు ప్రతిఫలంగానే తన వంతుగా ప్రభాస్‌ సాయం చేశాడని టాక్‌ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియా సర్కిళ్లలో తెగ వినిపిస్తోంది. ఈ విషయం తెలుగుసుకున్న ప్రభాస్‌ ఫ్యాన్స్‌ తెగ మురిసిపోతున్నారు. ‘మా డార్లింగ్ మనసు చాలా గొప్పది’ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కేజీఎఫ్‌ ఫేమ్‌ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న సలార్‌ సినిమాలో శ్రుతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇది కూడా ఈ ఏడాదే రిలీజ్‌ కానుంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Prabhas (@actorprabhas)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.