AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anni Manchi Sakunamule: ఓటీటీలోకి వచ్చేస్తోన్న ‘అన్ని మంచి శకునములే’.. స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడంటే..

ఈ క్రమంలో తాజాగా థియేటర్లలో సందడి చేసిన అన్నీ మంచి శకునములే చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధమయ్యింది. డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో యంగ్ హీరో సంతోష్ శోభన్, మాళవికా నాయర్ జంటగా నటించిన ఈ సినిమా మిక్డ్స్ టాక్ అందుకుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్‏గా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Anni Manchi Sakunamule: ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'అన్ని మంచి శకునములే'.. స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడంటే..
Anni Manchi Sakunamule
Rajitha Chanti
|

Updated on: Jun 15, 2023 | 3:04 PM

Share

ఇటీవల ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకున్న చిత్రాలు అంతే వేగంగా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. విడుదలైన నెలరోజులకే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. కేవలం పెద్ద సినిమాలే కాకుండా.. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై ప్రేక్షకులను మెప్పించిన చిన్ని చిత్రాలు కూడా వెంటనే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా థియేటర్లలో సందడి చేసిన అన్నీ మంచి శకునములే చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధమయ్యింది. డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో యంగ్ హీరో సంతోష్ శోభన్, మాళవికా నాయర్ జంటగా నటించిన ఈ సినిమా మిక్డ్స్ టాక్ అందుకుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్‏గా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ జూన్ 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా అనౌన్స్ చేసింది అమెజాన్ ప్రైమ్. తెలుగుతోపాటు.. హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ ఈ చిత్రం స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుపింది. ఈ చిత్రాన్ని స్వప్న సినిమాస్, మిత్రవింద మూవీస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించగా.. రాజేంద్రప్రసాద్, గౌతమి కీలకపాత్రలలో నటించారు.

ఇవి కూడా చదవండి

సినిమా కథేంటంటే.. రెండు కుటుంబాల మధ్య ఎప్పటికీ పరిష్కారం కానీ గొడవలు ఉంటాయి. ఇక ఈ రెండు ఇళ్లలోనూ ఒకేరోజు పుట్టిన పిల్లలు ఆసుపత్రి నర్సుల పొరపాటు వలన తారుమారు అయిపోతారు. ఫలితంగా ఒకరింట్లో మరొకరు పెరుగుతారు. వీరిద్దరు చిన్నప్పటి నుంచి స్నేహితులుగా ఉన్నా.. ఆ తర్వాత హీరోకు హీరోయిన్ పై ఇష్టం పెరగడం.. దానిని చెప్పలేకపోతారు. ఆ తర్వాత బిజినెస్ పని మీద ఇద్దరు విదేశాలకు వెళ్లగా అక్కడ వీరికి గొడవ జరిగి విడిపోతారు. ఆ తర్వాత ఇరు కుటుంబాల మధ్య గొడవ తగ్గిందా? ఈ ప్రేమికులు కలుసుకున్నారా ?లేదా ? అనేది కథ.

అమెజాన్ ప్రైమ్ వీడియో ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

చేతికి 6 వేళ్లు ఉంటే మంచిదా.. చెడ్డదా..? శాస్త్రం ఏం చెబుతోందంటే.
చేతికి 6 వేళ్లు ఉంటే మంచిదా.. చెడ్డదా..? శాస్త్రం ఏం చెబుతోందంటే.
వాహనదారులకు బిగ్ అలర్ట్‌.. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త రూల్‌..
వాహనదారులకు బిగ్ అలర్ట్‌.. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త రూల్‌..
స్కార్పియోలో వచ్చిన దొంగలు.. ఏం ఎత్తుకెళ్లారో తెలుసా..?
స్కార్పియోలో వచ్చిన దొంగలు.. ఏం ఎత్తుకెళ్లారో తెలుసా..?
వాలెంటైన్స్ డే ప్రేమ జాతకం.. ఈ రాశుల వారి ప్రేమ సక్సెస్ !
వాలెంటైన్స్ డే ప్రేమ జాతకం.. ఈ రాశుల వారి ప్రేమ సక్సెస్ !
ప్రోటీన్ లేదా ఫైబర్.. బరువు తగ్గడంలో ఏది ఉత్తమ ఫలితాలను ఇస్తుంది!
ప్రోటీన్ లేదా ఫైబర్.. బరువు తగ్గడంలో ఏది ఉత్తమ ఫలితాలను ఇస్తుంది!
జాతకం బాగున్నా.. వివాహం ఆలస్యం అవుతుందా.. కారణం ఇదే!
జాతకం బాగున్నా.. వివాహం ఆలస్యం అవుతుందా.. కారణం ఇదే!
ఆరేళ్ల బాలికను వదలని కామాంధులు..!
ఆరేళ్ల బాలికను వదలని కామాంధులు..!
నీకు మంచి ఫ్యూచర్ ఉంది.. ఆ హీరో మూవీపై అనిల్ రావిపూడి ప్రశంసలు
నీకు మంచి ఫ్యూచర్ ఉంది.. ఆ హీరో మూవీపై అనిల్ రావిపూడి ప్రశంసలు
ప్రభాస్‏తో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.. ? ఇప్పుడేలా ఉందంటే..
ప్రభాస్‏తో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.. ? ఇప్పుడేలా ఉందంటే..
ఒకే ఫ్రేములో వైఎస్ జగన్‌, సూర్య, కార్తీ..ఎందుకు కలిశారంటే? వీడియో
ఒకే ఫ్రేములో వైఎస్ జగన్‌, సూర్య, కార్తీ..ఎందుకు కలిశారంటే? వీడియో