AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: అల్లు అర్జున్ సరసన శ్రీలీల.. ఆహా కోసం స్పెషల్ మూవీ.. ఫస్ట్ లుక్ రిలీజ్..

ప్రముఖ ఓటీటీ తెలుగు మాధ్యమం ఆహాలో బన్నీ ఓ స్పెషల్ మూవీ చేయబోతున్నారు. త్రివిక్రమ్, బన్నీ కాంబోలో రాబోతున్న సినిమా ఏకంగా ఆహా కోసమే అని తెలుస్తోంది. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ అంటూ వారిద్దరూ షూటింగ్ సెట్ లో ఉన్న ఫోటోను విడుదల చేసింది. అయితే ఆ ఫోటోపై మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. తాజాగా ఈ ప్రాజెక్ట్ నుంచి మరో క్రేజీ పోస్టర్ రిలీజ్ చేసింది ఆహా.

Allu Arjun: అల్లు అర్జున్ సరసన శ్రీలీల.. ఆహా కోసం స్పెషల్ మూవీ.. ఫస్ట్ లుక్ రిలీజ్..
Sreeleela, Allu Arjun
Rajitha Chanti
|

Updated on: Jun 14, 2023 | 3:01 PM

Share

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీ కోసం పాన్ ఇండియా సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కాకుండా బన్నీ మరో చిత్రంలో నటించడం లేదు. పుష్ప 2 అనంతరం.. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నట్లు గతంలో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇదే కాకుండా.. మరోసారి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ ఓ మూవీ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. కానీ ఇప్పటివరకు ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఇప్పుడు బన్నీ అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ఎందుకంటే… ఓవైపు వెండితెరపై సత్తా చాటుతోన్న బన్నీ.. ఇప్పుడు ఆహా కోసం డిజిటల్ ఎంట్రీకి సిద్ధమయ్యారు. ప్రముఖ ఓటీటీ తెలుగు మాధ్యమం ఆహాలో బన్నీ ఓ స్పెషల్ మూవీ చేయబోతున్నారు. త్రివిక్రమ్, బన్నీ కాంబోలో రాబోతున్న సినిమా ఏకంగా ఆహా కోసమే అని తెలుస్తోంది. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ అంటూ వారిద్దరూ షూటింగ్ సెట్ లో ఉన్న ఫోటోను విడుదల చేసింది. అయితే ఆ ఫోటోపై మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. తాజాగా ఈ ప్రాజెక్ట్ నుంచి మరో క్రేజీ పోస్టర్ రిలీజ్ చేసింది ఆహా.

త్రివిక్రమ్, బన్నీ కాంబోలో రాబోతున్న మూవీలో శ్రీలీల కథానాయికగా నటిస్తున్నట్లు అనౌన్స్ చేసింది. తాజాగా ఈరోజు శ్రీలీల పుట్టినరోజు కావడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది. అందులో అల్లు అర్జున్.. శ్రీలీలను ఎత్తకొని స్టైల్ గా ఫోజు ఇచ్చాడు. దీంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతుంది. వీళ్లిద్దరూ కలిసి స్టెప్పేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి.. ఆహా నుంచి రాబోతున్న అతిపెద్ద ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేయండి అంటూ ట్వీట్ చేసింది ఆహా. దీంతో ఈ ప్రాజెక్ట్ పై అభిమానులలో మరింత ఆసక్తి నెలకొంది.

ఇవి కూడా చదవండి

అయితే ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. శ్రీలీల, బన్నీ కాంబోలో ప్రాజెక్ట్ అంటే అదిరిపోతుందని.. ఇక వీరిద్దరు కలిసి డ్సాన్స్ చేస్తే ఏ రెంజ్‏లోని ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. ఇక సోషల్ మీడియా వేదికగా శ్రీలీలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం త్రివిక్రమ్ .. మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కారం కోడిగుడ్డు వేపుడు.. వేడి అన్నంలో ఒక్కసారి తింటే వదిలిపెట్టరు
కారం కోడిగుడ్డు వేపుడు.. వేడి అన్నంలో ఒక్కసారి తింటే వదిలిపెట్టరు
హైదరాబాద్ ప్రజలకు దసరా గిఫ్ట్.. ప్రభుత్వం నుంచి మరో శుభవార్త..?
హైదరాబాద్ ప్రజలకు దసరా గిఫ్ట్.. ప్రభుత్వం నుంచి మరో శుభవార్త..?
తొలి మ్యాచ్‌కు సిద్ధమైన వైభవ్ సూర్యవంశీ.. ఉప్పల్‌లో డెబ్యూకు రెడీ
తొలి మ్యాచ్‌కు సిద్ధమైన వైభవ్ సూర్యవంశీ.. ఉప్పల్‌లో డెబ్యూకు రెడీ
జురాసిక్ కాలం నాటి వుల్లీ మమ్మోత్‌లకు మళ్లీ ప్రాణం పోస్తున్న AI
జురాసిక్ కాలం నాటి వుల్లీ మమ్మోత్‌లకు మళ్లీ ప్రాణం పోస్తున్న AI
బీపీ, షుగర్ అదుపులో ఉండాలంటే ఈ ఉప్మా తినండి చాలు..
బీపీ, షుగర్ అదుపులో ఉండాలంటే ఈ ఉప్మా తినండి చాలు..
ఏపీలో నాణ్యమైన ఉల్లిపాయలు కిలో రూ.35కే..
ఏపీలో నాణ్యమైన ఉల్లిపాయలు కిలో రూ.35కే..
పండగ సేల్స్‌లో ANC ఫీచర్‌తో వచ్చే టాప్-5 నెక్‌బ్యాండ్స్ ఇవే!
పండగ సేల్స్‌లో ANC ఫీచర్‌తో వచ్చే టాప్-5 నెక్‌బ్యాండ్స్ ఇవే!
అనుభవం నుంచి నేర్చుకున్న పాఠం.. ఈసారి మహేష్ బాకీ తీర్చేస్తాడా?
అనుభవం నుంచి నేర్చుకున్న పాఠం.. ఈసారి మహేష్ బాకీ తీర్చేస్తాడా?
రంగు నలుపు.. ఘాటు మాత్రం అదుర్స్..
రంగు నలుపు.. ఘాటు మాత్రం అదుర్స్..
తొలి వెబ్ సిరీస్‌తోనే సెన్సేషన్ సృష్టించిన డైరెక్టర్ డేగల బాబు
తొలి వెబ్ సిరీస్‌తోనే సెన్సేషన్ సృష్టించిన డైరెక్టర్ డేగల బాబు