AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bichagadu 2: ‘బిచ్చగాడు 2’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎప్పుడు.. ఎక్కడంటే..?

Vijay Antony: ఇట్స్ అఫీషియల్.. అవును బిచ్చగాడు 2 త్వరలో ఓటీటీలోకి రాబోతుంది. దీనిపై ప్రకటన వచ్చేసింది. ఈ సినిమా మిస్ అయినవాళ్లు, రెండోసారి చూడాలి అనుకునేవారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

Bichagadu 2: ‘బిచ్చగాడు 2’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎప్పుడు.. ఎక్కడంటే..?
Bichagadu 2
Ram Naramaneni
|

Updated on: Jun 15, 2023 | 2:55 PM

Share

విజయ్ ఆంటోని.. మ్యూజిక్ డైరెక్టర్ నుంచి కథానాయకుడిగా మారిన వ్యక్తి. అది కూడా ప్రయోగాత్మక సినిమాలతో తనకంటూ ప్రత్యేకతను సృష్టించుకున్నాడు. బిచ్చగాడు సినిమాతో తెలుగులోనూ విపరీతంగా పాపులర్ అయ్యాడు. మదర్ సెంటిమెంట్‌తో వచ్చిన ఆ సినిమా ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. చాలాకాలం తర్వాత దానికి కొనసాగింపుగా బిచ్చగాడు 2తో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు ఆంటోని. ఈ సినిమాలో సిస్టర్ సెంటిమెంట్‌ను ప్రధానమైన అంశంగా తీసుకున్నారు. ఈ మూవీ అటు తమిళ్‌లోనూ, ఇటు తెలుగులోనూ మంచి హిట్ అయ్యింది. ఈ మూవీ త్వరలో ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ నెల 18 నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌‌లో స్ట్రీమింగ్ అవ్వనుంది.

తమిళ్, తెలుగుతో పాటు కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ సినిమాను చూడొచ్చు. కాగా ఈ సినిమాను తెలుగులో బాగా ప్రమోట్ చేశాడు ఆంటోని. పలు ప్రాంతాల్లో బిచ్చగాళ్లకు  ‘యాంటీ బికిలీ’ పేరుతో చెప్పులు, అద్దం, సబ్బు, దువ్వెన, పౌడర్, నూనె బాటిల్,  విసనకర్ర, దుప్పటి, గొడుగు ఉన్న కిట్ల అందజేశాడు. ఇప్పటికే విజయ్ ఆంటోని సినిమాలు అంటే చూడాలిరా బై అనే జనాలు తెలుగులోనూ ఉన్నారు. త్వరలో ఈ హీరో కూడా సూర్య, కార్తీ రేంజ్ మార్కెట్ తెలుగులోనూ దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సబ్జెక్ట్ సెలక్షన్ ఇలానే ఉంటే.. కచ్చితంగా టాలీవుడ్‌లోనూ విజయ్ మార్కెట్ మరింతగా విస్తరిస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ