Upasana Konidela: పుట్టబోయే బిడ్డ కోసం ఉపాసన కీలక నిర్ణయం.. ‘స్టెమ్ సెల్ బ్యాంకింగ్’ అంటే ఏమిటో తెలుసా..
త్వరలోనే చరణ్, ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. దాదాపు పెళ్లైన 10 సంవత్సరాల తర్వాత ఉపాసన తల్లికాబోతుండడంతో వారసుడి కోసం మెగా ఫ్యామిలీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో జూన్ 14న చరణ్, ఉపాసన పెళ్లి రోజు. వీరి వివాహం జరిగి ఇప్పటివరకు 11 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్బంగా ఉపాసన తన సోషల్ మీడియా ఖాతాలలో ఓ వీడియో షేర్ చేసుకున్నారు.
మెగా కోడలు.. రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. అపోలో మేనేజింగ్ డైరెక్టర్స్‌లలో ఒకరిగా కొనసాగుతున్న ఉపాసన.. ఇటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొంటుంటారు. అంతేకాకుండా.. చెర్రీతో కలిసి సినిమా ఈవెంట్లలో సందడి చేస్తుంటారు. అంతేకాకుండా.. అటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు. కేవలం ఫ్యామిలీ విషయాలే కాకుండా.. ప్రజలకు అవసరమైన అంశాలు.. ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను సైతం నెట్టింట షేర్ చేసుకుంటారు. ఇదిలా ఉంటే.. త్వరలోనే చరణ్, ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. దాదాపు పెళ్లైన 10 సంవత్సరాల తర్వాత ఉపాసన తల్లికాబోతుండడంతో వారసుడి కోసం మెగా ఫ్యామిలీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో జూన్ 14న చరణ్, ఉపాసన పెళ్లి రోజు. వీరి వివాహం జరిగి ఇప్పటివరకు 11 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్బంగా ఉపాసన తన సోషల్ మీడియా ఖాతాలలో ఓ వీడియో షేర్ చేసుకున్నారు.
తాజాగా షేర్ చేసిన వీడియోలో స్టెమ్ సైట్ ఇండియాను ఎంచుకున్నానని.. స్టెమ్ సెల్ బ్యాంకింగ్ అంటే ఏంటో చెప్పుకొచ్చింది. స్టెమ్ సైట్ ఇండియాలో.. పుట్టబోయే బిడ్డకు సంబంధించిన కోర్డ్ బ్లడ్‌ను దాచుకుంటున్న్టలు తెలిపింది. స్టెమ్ సెల్ బ్యాంకింగ్ లో పుట్టిన బిడ్డకు సంబంధించిన బొడ్డు తాడును దాచుకోవడం వలన పెద్దయ్యాక వారికేమైనా ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినప్పుడు వాటి చికిత్సకు బొడ్డు తాడును ఉపయోగిస్తారని తెలిపింది.
ఇక ఇదే విషయాన్ని గతంలో మహేష్ బాబు సతీమణి నమ్రత సైతం ప్రస్తావించారు. తమ పిల్లలద్దిరీ విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. మన దేశంలో ఈ స్టెమ్ సెల్ బ్యాంకింగ్ గురించి చాలా మందికి పెద్ద తెలియదు. ముఖ్యంగా చెప్పాలంటే ప్రజలకు దీనిపై ఎలాంటి అవగాహన లేదు. తాజాగా ఉపాసన తీసుకున్న నిర్ణయాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు. అలాగే చరణ్, ఉపాసనకు పెళ్లిరోజు చెబుతూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
I have chosen @StemCyte_India India to preserve my baby’s CordBlood because of their unique Hybrid Model, Superior Technology and Highest Accreditations.
For more information, visit https://t.co/gQUuMlyRsG or call 1800 120 0086#StemCyteIndia #StemCellBanking#CordBlood… pic.twitter.com/CFMQvxTXSY
— Upasana Konidela (@upasanakonidela) June 13, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.