Adipurush OTT: ‘ఆదిపురుష్’ ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. ప్రభాస్ సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ది మోస్ట్ అవైటెడ్ మూవీ ఆదిపురుష్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇవాళ (జూన్ 16)న థియేటర్లలో ఆదిపురుషుడిగా ప్రభాస్ థియేటర్లలోకి అడుగపెట్టాడు. మొదటి షో నుంచే సినిమాకు సూపర్ హిట్ టాక్ వస్తోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ది మోస్ట్ అవైటెడ్ మూవీ ఆదిపురుష్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇవాళ (జూన్ 16)న థియేటర్లలో ఆదిపురుషుడిగా ప్రభాస్ థియేటర్లలోకి అడుగపెట్టాడు. మొదటి షో నుంచే సినిమాకు సూపర్ హిట్ టాక్ వస్తోంది. బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలవ్వడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్. నార్త్, సౌత్ అనే తేడా లేకుండా ఇప్పుడు ఎక్కడ చూసినా ఆది పురుష్ మేనియానే నడుస్తోంది. కాగా ప్రభాస్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ప్రభాస్‌కు ఉన్న క్రేజ్, పాన్ ఇండియా పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని అన్ని భాషలకు కలిపి రూ.150 కోట్లకు స్ట్రీమింగ్ రైట్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. అయితే సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో సుమారు 8 వారాల తర్వాతే ఆదిపురుష్ ఓటీటీలోకి రానుంది.
అంటే ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ఆది పురుష్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో.. అప్పటివరకు ఓటీటీ ఆడియెన్స్ వెయిట్ చేయాల్సిందే. రామాయణం మహాకావ్యం ఆధారంగా ఓం రౌత్ తెరకెక్కించిన ఆదిపురుష్‌లో ప్రభాస్ రాముడిగా కనిపించారు. కృతిసనన్ జానకిగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా నటించారు. అలాగే క్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవదత్తా నాగే నటించారు. రెట్రో ఫైల్ సమర్పణలో టి సిరీస్ బ్యానర్ పై నిర్మాత భూషణ్ కుమార్ సుమారు రూ.550 కోట్లకు పైగా బడ్జెట్ తో ఆదిపురుష్ సినిమాను నిర్మించారు. తెలుగులో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ మైథలాజికల్ మూవీని పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తోంది. కాగా ప్రభాస్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఆదిపురుష్‌ను తెరకెక్కించడం విశేషం.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..