AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

John Wick 4 OTT: ఓటీటీలోకి హాలీవుడ్‌ బ్లాక్ బస్టర్ సినిమా.. జాన్‌విక్‌ 4 స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

జాన్‌ విక్‌ సిరీస్‌ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. మన దేశంలోనూ ఈ యాక్షన్‌ సిరీస్‌కు పెద్ద ఎత్తున ఫ్యాన్స్‌ ఉన్నారు. అందుకు తగ్గట్టే ఈ సిరీస్‌లో ఇప్పటివరకు 4 సినిమాలు రిలీజ్‌ కాగా అన్నీ సూపర్‌ డూపర్‌ హిట్‌గా నిలిచాయి. ఇక కొన్నినెలల క్రితం విడుదలైన జాన్‌ విక్‌ ఛాప్టర్‌ 4 బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపింది

John Wick 4 OTT: ఓటీటీలోకి హాలీవుడ్‌ బ్లాక్ బస్టర్ సినిమా.. జాన్‌విక్‌ 4 స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
John Wick 4 Movie
Basha Shek
|

Updated on: Jun 16, 2023 | 1:48 PM

Share

జాన్‌ విక్‌ సిరీస్‌ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. మన దేశంలోనూ ఈ యాక్షన్‌ సిరీస్‌కు పెద్ద ఎత్తున ఫ్యాన్స్‌ ఉన్నారు. అందుకు తగ్గట్టే ఈ సిరీస్‌లో ఇప్పటివరకు 4 సినిమాలు రిలీజ్‌ కాగా అన్నీ సూపర్‌ డూపర్‌ హిట్‌గా నిలిచాయి. ఇక కొన్నినెలల క్రితం విడుదలైన జాన్‌ విక్‌ ఛాప్టర్‌ 4 బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపింది. కీను రీవ్స్ హీరోగా నటించిన ఈ సినిమా కనీవినీ ఎరుగని రీతిలో కలెక్షన్లు సాధించింది. ఓవరాల్‌గా 2000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్‌ పండితులు తెలిపారు. మనదేశంలోనూ ఈ సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. ఇలా థియేటర్లలో కాసుల వర్షం కురిపించిన జాన్‌విక్‌ 4 ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. అది కూడా ఈ నెలలోనే. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ లయన్స్‌ గేట్‌ ప్లేలో జూన్‌ 23 నుంచి జాన్‌ విక్‌ 4 స్ట్రీమింగ్‌ కానుంది. ఇంగ్లిష్‌తో పాటు తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో ఈ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ స్ట్రీమింగ్‌ కానుంది.

జాన్‌విక్‌ ఛాప్టర్‌ 4 సినిమాకు చాడ్ స్టాహెల్‌స్కీ దర్శకత్వం వహించారు. కీను రీవ్స్‌తో పాటు డోనీ యెన్, బిల్ స్కార్స్‌గార్డ్, లారెన్స్ ఫిష్‌బర్న్, హిరోయుకి సనాడా తదితరులు కీలక పాత్రలు పోషించారు. టైలర్ బేట్స్, జోయెల్ జె. రిచర్డ్ సంగీతం సమకూర్చారు. మరి థియేటర్లలో జాన్‌విక్‌ ఛాప్టర్‌ 4ను మిస్‌ అయిన వారు ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

భోజనం తర్వాత ఇలా ఓ పాన్‌ నోట్లో వేసుకోండి..! ప్రయోజనాలు తెలిస్తే
భోజనం తర్వాత ఇలా ఓ పాన్‌ నోట్లో వేసుకోండి..! ప్రయోజనాలు తెలిస్తే
ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్