AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Malli Pelli OTT: ఓటీటీలోకి నరేశ్‌, పవిత్రా లోకేశ్‌ల ‘మళ్లీ పెళ్లి’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?

సీనియర్‌ నటీనటులు వీకే నరేశ్‌, పవిత్రా లోకేశ్‌ నటించిన చిత్రం మళ్లీ పెళ్లి. నరేశ్‌, పవిత్రల రియల్ లైఫ్‌లో జరిగిన కొన్ని సంఘటలను ఆధారంగా చేసుకుని సీనియర్‌ దర్శక నిర్మాత ఎమ్మెస్‌ రాజు ఈ మూవీని తెరకెక్కించారు. విజయకృష్ణ మూవీస్‌ బ్యానర్‌పై వీకే నరేశ్‌ స్వయంగా మళ్లీ పెళ్లీ సినిమాను నిర్మించాడు.

Malli Pelli OTT: ఓటీటీలోకి నరేశ్‌, పవిత్రా లోకేశ్‌ల 'మళ్లీ పెళ్లి'.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?
Malli Pelli Ott
Basha Shek
|

Updated on: Jun 16, 2023 | 7:52 AM

Share

సీనియర్‌ నటీనటులు వీకే నరేశ్‌, పవిత్రా లోకేశ్‌ నటించిన చిత్రం మళ్లీ పెళ్లి. నరేశ్‌, పవిత్రల రియల్ లైఫ్‌లో జరిగిన కొన్ని సంఘటలను ఆధారంగా చేసుకుని సీనియర్‌ దర్శక నిర్మాత ఎమ్మెస్‌ రాజు ఈ మూవీని తెరకెక్కించారు. విజయకృష్ణ మూవీస్‌ బ్యానర్‌పై వీకే నరేశ్‌ స్వయంగా మళ్లీ పెళ్లీ సినిమాను నిర్మించాడు. టీజర్స్‌, ట్రైలర్లతో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచిన ఈ సినిమా తీరా థియేటర్లలో రిలీజయ్యాక తుస్సుమనిపించింది. మే26 న రిలీజైన ఈ చిత్రం పెద్దగా ఆడలేదు. అయితే గట్టిగా ప్రమోషన్లు చేయడం, నరేశ్‌, పవిత్రాలోకేశ్‌లకు ఉన్న క్రేజ్‌ కారణంగా ఈ మూవీకి ఓ మోస్తరు కలెక్షన్లు వచ్చాయి. ఈక్రమంలో థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోని మళ్లీ పెళ్లీ సినిమా ఓటీటీలో రిలీజ్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఈ మూవీ డిజిటల్‌ రైట్స్‌ను సొంతం చేసుకుంది. నరేశ్‌, పవిత్రలకు ఉన్న ఫేమ్‌ దృష్ట్యా సుమారు రూ.2 కోట్లకు మళ్లీ పెళ్లీ ఓటీటీ హక్కులను కొనుగోలు చేసినట్లు సమాచారం.

ఈక్రమంలో థియేటర్లలో రిలీజై నెలరోజులు పూర్తవ్వడంతో ఈ నెల 24 లేదా 25న అమెజాన్ ప్రైమ్‌లో మ‌ళ్ళీ పెళ్లి స్ట్రీమింగ్‌ కానుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తుంది. తెలుగుతో పాటు కన్నడలోనూ ఒకేసారి ఈ మూవీని స్ట్రీమింగ్‌ చేయనున్నారు. మళ్లీ పెళ్లి సినిమాలో వనితా విజయ్‌ కుమార్‌ ఓ కీలక పాత్రలో నటించారు. అలాగే ఇటీవల కన్నుమూసిన శరత్‌బాబు కృష్ణ పాత్రలో చివరిసారిగా సిల్వర్‌ స్ర్కీన్‌పై కనిపించారు. అలాగే అన్నపూర్ణ, భద్రం తదితరులు కీలక పాత్రలు పోషించారు. అరుళ్‌ దేవ్‌, సురేష్‌ బొబ్బి మళ్లీ పెళ్లి సినిమాకు సంగీతం సమకూర్చగా, జునైద్ సిద్ధీఖీ ఎడిటర్‌గా వ్యవహరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఐపీఎల్ వేలంలోకి నయా విధ్వంసం ఎంట్రీ.. అన్ని రికార్డులు బద్దలే..!
ఐపీఎల్ వేలంలోకి నయా విధ్వంసం ఎంట్రీ.. అన్ని రికార్డులు బద్దలే..!
క్యాండీ క్రష్‌లో బీహార్‌ యువకుడి ప్రపంచ రికార్డ్!
క్యాండీ క్రష్‌లో బీహార్‌ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విమానంలో ఏయే వస్తువులను తీసుకెళ్లవచ్చు..? వీటికి నో ఎంట్రీ
విమానంలో ఏయే వస్తువులను తీసుకెళ్లవచ్చు..? వీటికి నో ఎంట్రీ
ట్రాక్‌ మధ్యలో కంకరాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా? వాటిని ఏమంటారంటే
ట్రాక్‌ మధ్యలో కంకరాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా? వాటిని ఏమంటారంటే
నమ్మితే నట్టేట ముంచాడు.. అతని చేతిలో దారుణంగా మోసపోయిన శివారెడ్డి
నమ్మితే నట్టేట ముంచాడు.. అతని చేతిలో దారుణంగా మోసపోయిన శివారెడ్డి
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్‌ఆర్‌టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్‌ ఉంటుందా?
దసరా పండుగకు టీజీఎస్‌ఆర్‌టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్‌ ఉంటుందా?
తెలుగురాని తెలుగు వాళ్లు
తెలుగురాని తెలుగు వాళ్లు