AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adipurush: ‘ఆదిపురుష్‌’ అందరి హృదయాలను గెల్చుకోవాలి.. ప్రభాస్‌ సినిమాకు ఆమిర్‌ఖాన్‌ బెస్ట్‌ విషెస్‌

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆది పురుష్‌ మేనియా కొనసాగుతోంది. పాన్‌ ఇండియా హీరో ప్రభాస్‌ నటించిన ఈ సినిమా కోసం అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే అడ్వాన్స్‌ బుకింగ్‌లో సంచలనాలు సృష్టించిన ప్రభాస్‌ సినిమా భారీ అంచనాల మధ్య శుక్రవారం (జూన్‌ 16) గ్రాండ్‌గా రిలీజ్‌కానుంది.

Adipurush: 'ఆదిపురుష్‌' అందరి హృదయాలను గెల్చుకోవాలి.. ప్రభాస్‌ సినిమాకు ఆమిర్‌ఖాన్‌ బెస్ట్‌ విషెస్‌
Aamir Khan
Basha Shek
|

Updated on: Jun 15, 2023 | 9:17 PM

Share

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆది పురుష్‌ మేనియా కొనసాగుతోంది. పాన్‌ ఇండియా హీరో ప్రభాస్‌ నటించిన ఈ సినిమా కోసం అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే అడ్వాన్స్‌ బుకింగ్‌లో సంచలనాలు సృష్టించిన ప్రభాస్‌ సినిమా భారీ అంచనాల మధ్య శుక్రవారం (జూన్‌ 16) గ్రాండ్‌గా రిలీజ్‌కానుంది. ఈనేపథ్యంలో సినీ, రాజకీయ ప్రముఖులు ఆదిపురుష్‌ చిత్రబృందానికి ఆల్‌ ది బెస్ట్‌ చెబుతున్నారు. సినిమా సూపర్‌ హిట్‌ కావాలంటూ సోషల్‌ మీడియా వేదికగా పోస్టులు, ట్వీట్లు పెడుతున్నారు. ఈక్రమంలో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ ఖాన్‌ ఆదిపురుష్‌ యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌ తెలిపారు. నిర్మాత భూషణ్‌ కుమార్, హీరో ప్రభాస్‌, సైఫ్‌ అలీఖాన్‌, ఓం రౌత్‌ కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. ‘ఆదిపురుష్‌’ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆమిర్‌ పేర్కొన్నారు.

కాగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌, డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ, మెహర్‌ రమేశ్‌ తదితరులు ఆదిపురుష్‌ టీంకు విషెస్‌ తెలిపారు. ప్రభాస్‌ సినిమా పెద్ద హిట్‌ కావాలని ఆకాంక్షించారు. ఇక ఆమీర్‌ ఖాన్‌ చివరిగా లాల్‌ సింగ్ చద్దా అనే సినిమాలో కనిపించారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉండాలని ఆయన నిర్ణయించుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే నిర్మాతగా మాత్రం కొన్ని సినిమాలు తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు. ఇందుకోసం మంచి స్క్రిప్ట్‌ కోసం చూస్తున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!