AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భార్యను కౌగిలించుకొని తుపాకీతో కాల్చిన భర్త.. కానీ అదే బుల్లెట్‌ తగిలి భర్త స్పాట్ డెడ్!

ట్టుకున్న భార్యను చంపాలని పెద్ద పన్నాగమే పన్నాడు ఓ భర్త. ప్రేమగా ఆమెను కౌగలించుకని తుపాకీతో కాల్చాడు. ఐతే ఆ తర్వాత జరిగిన సీన్‌ పాపం అస్సలు ఊహించి ఉండడు. అదే బుల్లెట్‌ భార్య శరీరంలో నుంచి దూసుకు వచ్చి అతనూ..

భార్యను కౌగిలించుకొని తుపాకీతో కాల్చిన భర్త.. కానీ అదే బుల్లెట్‌ తగిలి భర్త స్పాట్ డెడ్!
Husband Shoots Wife
Srilakshmi C
|

Updated on: Jun 16, 2023 | 4:24 PM

Share

లక్నో: కట్టుకున్న భార్యను చంపాలని పెద్ద పన్నాగమే పన్నాడు ఓ భర్త. ప్రేమగా ఆమెను కౌగలించుకని తుపాకీతో కాల్చాడు. ఐతే ఆ తర్వాత జరిగిన సీన్‌ పాపం అస్సలు ఊహించి ఉండడు. అదే బుల్లెట్‌ భార్య శరీరంలో నుంచి దూసుకు వచ్చి అతనూ బలైపోయాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జూన్‌ 13వ తేదీన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

రాష్ట్రంలోని మొరాదాబాద్‌ బిలారీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఖాన్‌పూర్‌ గ్రామంలో అనేక్‌ పాల్‌ (40), అతని భార్య సుమన్‌ పాల్‌ (38) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి నలుగురు పిల్లలు సంతానం. కొద్దిరోజుల క్రితం సుమన్‌ పాల్‌ తన ఫోన్‌ ఎక్కడో పోగొట్టుకుంది. ఈ విషయమై భార్య, భర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో గత మంగళవారం (జూన్‌ 13) రాత్రి అనేక్‌పాల్‌ ఇంట్లో పూజ ముగిసిన తర్వాత, భార్య వద్దకు వెళ్లి కౌగిలించుకున్నాడు. అనంతరం తన వద్ద ఉన్న నాటు తుపాకీతో భార్యను వెనుకవైపు నుంచి వీపుపై కాల్చాడు. ఐతే ఆమె ఛాతీ నుంచి బయటకు దూసుకొచ్చిన తుపాకీ బుల్లెట్‌ అనేక్‌ పాల్‌ గుండెల్లోనుంచి చీల్చుకుంటూ వెళ్లింది. దీంతో భార్యభర్తలిరువురూ అక్కడికక్కడే మృతి చెందారు. కాల్పల శబ్దం రావడంతో ఇరుగుపొరుగు అనేక్‌పాల్‌ ఇంట్లోకి పరుగుపరుగున వచ్చారు. రక్తం మడుగులో ఉన్న వారిద్దరినీ సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే వాళ్లు మృతి చెందినట్లు ధృవీకరించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అనేక్‌పాల్‌కు తుపాకి ఎలా లభించింది? భార్యను చంపడానికి ముందు క్షద్రపూజలేమైనా చేశాడా? అనే కోణంలో కూడా దర్యాప్తుసాగుతోంది. ఇరుగు పొరుగు వారిపై ఎటువంటి ఆరోపణలు చేయకపోవడం గమనార్హం. తల్లిదండ్రులు మృతి చెందడంతో నలుగురు పిల్లలు అనాధలయ్యారు. వారిని తల్లి తరపు బంధువులు తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.