Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Gopal Varma: ఆస్కార్ రావాల్సింది ‘ఆర్ఆర్‌ఆర్‌’కి కాదు.. ఆయనకు దక్కాల్సింది’.. ఆర్జీవీ సెటైరిక్ ట్వీట్‌ వైరల్

టాలీవుడ్ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ మాట్లాడినా, సినిమా తీసినా అంతెందుకు ట్వీట్‌ చేసినా అదో పెద్ద సంచలనంగా మారుతుంది. తన ముక్కుసూటితనంతో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు. భిన్నమైన ఆలోచనలతో..

Ram Gopal Varma: ఆస్కార్ రావాల్సింది 'ఆర్ఆర్‌ఆర్‌'కి కాదు.. ఆయనకు దక్కాల్సింది'.. ఆర్జీవీ సెటైరిక్ ట్వీట్‌ వైరల్
Ram Gopal Varma
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 15, 2023 | 9:01 AM

టాలీవుడ్ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ మాట్లాడినా, సినిమా తీసినా అంతెందుకు ట్వీట్‌ చేసినా అదో పెద్ద సంచలనంగా మారుతుంది. తన ముక్కుసూటితనంతో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంటాడు. భిన్నమైన ఆలోచనలతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఆర్టీవీ.. క్రియేటివ్ డైరెక్టర్‌గానే కాక ఎందరో ఫిలిం మేకర్స్‌కు ఆయన రోల్ మోడల్‌. ఒకప్పుడు తన సినిమాలతో టాలీవుడ్‌ను ఏలిన ఆర్జీవీ ఈ మధ్యకాలంలో బొత్తిగా పసలేని సినిమాలు తీస్తూ అందరి విమర్శలను మూటగట్టుకుంటున్నాడు (ఎన్ని విమర్శలెదురైనా ఆర్జీవీ పట్టించుకోడు అది వేరే విషయం). ఆర్జీవీ సోషల్ మీడియలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటాడనే విషయం ప్రత్యకంగా చెప్పనసవరం లేదు. తాజాగా ఆర్జీవీ చేసిన ట్వీట్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇంతకీ సంగతేమంటే..
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఇటీవల యువగళం పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. మిషన్‌ రాయలసీమలో భాగంగా ఇటీవల రాయలసీమలో పాదయాత్ర ముగియడంతో నేలపై మోకరిల్లి నమస్కరిస్తున్న ఫోటోను లోకేశ్ తన ట్విటర్‌ ఖాతాలో షేర్ చేశారు. ‘మీ ప్రేమాభిమానాలకు, మీ గుండెల్లోకి నన్ను ఆహ్వానించినందుకు రాయలసీమ సోదరులు, సోదరీమణులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు’ అంటూ లోకేష్‌ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. ఐతే ఆర్జీవీ దీనిపై తనదైన శైలిలో కౌంటరిచ్చాడు. ‘ఆస్కార్ అవార్డు రావాల్సింది ఆర్ఆర్ఆర్ సినిమాకి కాదు.. రాజమౌళి, కీరవాణి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లకు కూడా కాదు.. ఈ పురస్కారం నారా లోకేశ్‌కు దక్కాల్సింది. యాక్షన్‌ ఉంటుంది, ఓవర్‌ యాక్షన్‌ కూడా ఉంటుంది. కానీ ఇది అల్టిమెట్‌ యాక్షన్‌’ అంటూ నమస్కరిస్తున్న ఎమోజీలను యాడ్‌ చేసి సెటైరికల్‌గా ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఆర్టీజీ ట్వీట్‌ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

హెల్త్ సూపర్ వైజర్ దారుణ హత్య.. మిరపతోటలో గొడ్డలితో నరికి చంపిన
హెల్త్ సూపర్ వైజర్ దారుణ హత్య.. మిరపతోటలో గొడ్డలితో నరికి చంపిన
పుచ్చకాయలోని తెల్లని భాగం పొరబాటున ఎప్పుడైనా తినేశారా?
పుచ్చకాయలోని తెల్లని భాగం పొరబాటున ఎప్పుడైనా తినేశారా?
ఓటీటీలోకి వచ్చేసిన వరలక్ష్మి క్రైమ్ థ్రిల్లర్..ఊహించని ట్విస్టులు
ఓటీటీలోకి వచ్చేసిన వరలక్ష్మి క్రైమ్ థ్రిల్లర్..ఊహించని ట్విస్టులు
ఓవైపు వివాదాలు.. మరోవైపు దిమ్మతిరిగే కలెక్షన్స్..
ఓవైపు వివాదాలు.. మరోవైపు దిమ్మతిరిగే కలెక్షన్స్..
అప్పుడు రజినీకాంత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు బుల్లితెర
అప్పుడు రజినీకాంత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు బుల్లితెర
టాలీవుడ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న ఈ అమ్మాయిని గుర్తు పట్టారా?
టాలీవుడ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న ఈ అమ్మాయిని గుర్తు పట్టారా?
మీరూ రాత్రి భోజనంలో అన్నం తింటున్నారా?
మీరూ రాత్రి భోజనంలో అన్నం తింటున్నారా?
ఈ చిన్న అలవాట్లతో మీ పిల్లల జ్ఞాపకశక్తి పెరుగుతుంది..!
ఈ చిన్న అలవాట్లతో మీ పిల్లల జ్ఞాపకశక్తి పెరుగుతుంది..!
మరో ఘోర రైలు ప్రమాదం.. మంటల్లో లోకో పైలెట్లు సహా ముగ్గురు మృతి..!
మరో ఘోర రైలు ప్రమాదం.. మంటల్లో లోకో పైలెట్లు సహా ముగ్గురు మృతి..!
మోనాలిసా డైరెక్టర్ అరెస్ట్ కేసులో బిగ్ ట్విస్ట్..
మోనాలిసా డైరెక్టర్ అరెస్ట్ కేసులో బిగ్ ట్విస్ట్..