MMTS Trains: జంట నగరాల రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. 22 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు.. కారణం ఇదే!
నాలుగు రోజుల పాటు పలు ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే బుధవారం (జూన్ 14) ప్రకటించింది. జూన్ 14, 15 తేదీల్లో లింగంపల్లి- హైదరాబాద్, హైదరాబాద్-లింగంపల్లి మధ్య 10 రైళ్లను రద్దు చేశారు. జూన్ 14 నుంచి 17 తేదీల్లో..
హైదరాబాద్: నాలుగు రోజుల పాటు పలు ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే బుధవారం (జూన్ 14) ప్రకటించింది. జూన్ 14, 15 తేదీల్లో లింగంపల్లి- హైదరాబాద్, హైదరాబాద్-లింగంపల్లి మధ్య 10 రైళ్లను రద్దు చేశారు. జూన్ 14 నుంచి 17 తేదీల్లో ఉందానగర్-లింగంపల్లి, లింగంపల్లి-ఫలక్‌నుమా, రామచంద్రాపురం-ఫలక్‌నుమా రూట్లలో పలు ఎంఎంటీఎస్ రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ ప్రకటించారు. నిర్వహణ పనుల కారణంగా మొత్తం 22 ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీసులను రద్దు చేసినట్లు ఆయన తెలిపారు. మరోవైపు అనకాపల్లి జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో విశాఖ నుంచి బుధవారం 5.45గంటలకు బయల్దేరాల్సిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు (20833) ఉదయం 8.45 గంటలకు బయల్దేరింది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరాల్సిన సికింద్రాబాద్ – విశాఖ వందేభారత్ రైలు (20834).. నాలుగు గంటలు ఆలస్యంగా రాత్రి 7 గంటలకు బయల్దేరుతుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
రద్దైన ఎంఎంటీఎస్ రైళ్ల పూర్తి లిస్ట్ ఇదే..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.