Largest Kidney Stone: బాబోయ్  కిడ్నీలో రాయి కాదు! ఏకంగా పె..ద్ద.. బండ! గిన్నిస్ రికార్డుకెక్కిన కిడ్నీ స్టోన్‌

కిడ్నీల్లో రాళ్లు ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. సాధారణంగా కిడ్నీలో ఏర్పటే రాళ్లు చాలా చిన్న సైజులో ఉంటాయి. ఆపరేషన్‌తోపని లేకుండానే మందుల ద్వారా వాటంతట అవే కరిగిపోయేలా డాక్టర్లు మందులు ఇస్తుంటారు. ఐతే కొన్ని సందర్భాల్లో రాళ్ల సైజు కాస్త..

Largest Kidney Stone: బాబోయ్  కిడ్నీలో రాయి కాదు! ఏకంగా పె..ద్ద.. బండ! గిన్నిస్ రికార్డుకెక్కిన కిడ్నీ స్టోన్‌
Largest Kidney Stone
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 14, 2023 | 7:31 PM

కొలంబో: కిడ్నీల్లో రాళ్లు ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. సాధారణంగా కిడ్నీలో ఏర్పటే రాళ్లు చాలా చిన్న సైజులో ఉంటాయి. ఆపరేషన్‌తోపని లేకుండానే మందుల ద్వారా వాటంతట అవే కరిగిపోయేలా డాక్టర్లు మందులు ఇస్తుంటారు. ఐతే కొన్ని సందర్భాల్లో రాళ్ల సైజు కాస్త పెద్దగా ఉండటంతో సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఎంతపెద్ద రాళ్లైనా 20 నుంచి 30 గ్రాముల వరకు బరువుంటాయి. లేదా అంతకన్నా కన్నా తక్కువ సైజులో ఉంటాయి. అయితే ఓ వ్యక్తి కిడ్నీలో రాల్లు కాదు ఏకంగా బండ సైజు ఉన్న పెద్ద రాయి ఉంది. దాని బరువు ఏకంగా 801 గ్రాములు ఉంది. ఇక పరిమాణం 13.372 సెం.మీ (అంటే 5.264 అంగుళాలు) ఉంది. ఆ వ్యక్తికి మంగళవారం ఆపరేషన్‌ చేసిన శ్రీలంక డాక్టర్లు విజయవంతంగా దాన్ని తొలగించారు.

ఇప్పటి వరకు కొలంబోలోని ఆర్మీ హస్పిటల్ వైద్యులు పేరిట ప్రపంచంలోనే అతి పెద్ద కిడ్నీ రాయిని తొలగించిన రికార్డు ఉంది. 2004లో భారత్‌కి చెందిన ఓ వ్యక్తికి 13 సెంటీమీటర్ల కిడ్నీ స్టోన్ పేరిట రికార్డు ఉండేది. అంతకుముందు 2008లో పాకిస్థాన్‌లో 620 గ్రాముల కిడ్నీ స్టోన్‌ను తొలగించారు. ఈ రికార్డులన్నింటినీ బ్రేక్‌ చేస్తూ.. తాజాగా శ్రీలంక డాక్టర్లు చేసి తొలగించిన రాయినే ప్రపంచంలో అతి పెద్ద కిడ్నీ స్టోన్‌గా గుర్తింపు దక్కించుకుని గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డు కెక్కింది. 13.372 సెంటీ మీటర్ల పరిమాణం ఉంది మరి. కన్సల్టెంట్ యూరాలజిస్ట్ లెఫ్టినెంట్ కల్నల్ (డా) కె. సుదర్శన్, జెనిటో యూరినరీ యూనిట్ హెడ్ డా పతిరత్న, డాక్టర్ థమాషా ప్రేమతిలక ఈ శస్త్రచికిత్స నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ