ముందే హెచ్చరించినా నిర్లక్ష్యం.. నడి సముద్రంలో వలసదారుల పడవ బోల్తా..17 మంది మృతి

గ్రీస్‌ దేశంలో బుధవారం తెల్లవారుజామున (జూన్‌ 14) ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పెద్ద సంఖ్యలో వలసదారులతో వెళ్తోన్న ఫిషింగ్ బోట్ పెలోపొన్నీస్ తీరంలో బోల్తా పడింది. వెంటనే గ్రీక్‌ కోస్ట్‌గార్ట్‌ రెస్క్యూ ఆపరేషన్‌..

ముందే హెచ్చరించినా నిర్లక్ష్యం.. నడి సముద్రంలో వలసదారుల పడవ బోల్తా..17 మంది మృతి
Ship Capsizes
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 14, 2023 | 4:24 PM

ఏథెన్స్‌: గ్రీస్‌ దేశంలో బుధవారం తెల్లవారుజామున (జూన్‌ 14) ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పెద్ద సంఖ్యలో వలసదారులతో వెళ్తోన్న ఫిషింగ్ బోట్ పెలోపొన్నీస్ తీరంలో బోల్తా పడింది. వెంటనే గ్రీక్‌ కోస్ట్‌గార్ట్‌ రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించించి 100 మందిని రక్షించగలిగింది. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనలో 17 మంది మృతి చెందారు. అయోనియన్ సముద్రంలో అంతర్జాతీయ జలాల్లో ఈ ప్రమాదం సంభవించింది. బలమైన గాలుల వల్ల పడవబోల్తా పడినట్లు కోస్ట్‌గార్డ్ అధికారులు వెల్లడించారు. నౌకాదళంతో పాటు, ఆర్మీ విమానం, హెలికాప్టర్‌, ఆరు పడవలు ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి.

ప్రమాదకర రీతిలో అధిక సంఖ్య ప్రయాణికులతో వెళ్తున్న ఈ పడవను యూరప్ ఫ్రాంటెక్స్ ఏజెన్సీతో కూడిన నిఘా విమానం మంగళవారం మధ్యాహ్నమే గుర్తించి హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఆ పడవలోని ప్రయాణీకులు అభ్యంతరం తెల్పినట్లు కోస్ట్‌గార్డ్ చెప్పారు. పైగా పడవలో ఉన్నవారెవ్వరూ లైఫ్ జాకెట్లు ధరించలేదని, వారి జాతీయతలను కూడా వెంటనే వెల్లడించలేదని తెలిపారు. వలసదారులు లిబియా నుంచి ఇటలీకి వెళ్తున్నట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు.

ఈ రోజు క్రీట్ నుంచి 80 మంది వలసదారులతో వెళ్తున్న మరో పడవను కోస్ట్‌గార్డ్ పెట్రోలింగ్ ద్వారా రక్షించినట్లు గ్రీస్ పోర్ట్ పోలీసులు తెలిపారు. కాగా ఆఫ్రికా, మధ్యప్రాచ్యం నుంచి ఐరోపాకు వలస వెళ్లగోరేవారికి ఇటలీ, స్పెయిన్‌, గ్రీస్ ఎంతో కాలంగా ప్రధాన ల్యాండింగ్ పాయింట్‌లుగా ఉన్నాయి. సముద్రంలో గస్తీని తప్పించుకునే క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయని, ఫలితంగా వేలాది వలసదారులు నీటమునిగి ప్రాణాలువదులుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ