AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aishwarya Rai: ఫైనల్లీ.. కూతురి చెయ్యి వదిలేసిన ఐష్‌..! ఎన్నాళ్లని తల్లి వేలు పట్టుకుని నడుస్తుంది?

బాలీవుడ్ స్టార్ కపుల్ అభిషేక్, ఐశ్వర్యారాయ్ బుధవారం (జూన్‌ 14) ముంబై ఎయిర్‌పోర్టులో తళుక్కుమన్నారు. కూతురు ఆరాధ్యతో కలిసి వెకేషన్‌కు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఐశ్వర్య, అభిషేక్ బ్లాక్ హూడీలో కనిపించారు. ఆరాధ్య ఎరుపు రంగు హూడీలో..

Aishwarya Rai: ఫైనల్లీ.. కూతురి చెయ్యి వదిలేసిన ఐష్‌..! ఎన్నాళ్లని తల్లి వేలు పట్టుకుని నడుస్తుంది?
Aishwarya Rai
Srilakshmi C
|

Updated on: Jun 14, 2023 | 5:57 PM

Share

బాలీవుడ్ స్టార్ కపుల్ అభిషేక్, ఐశ్వర్యారాయ్ బుధవారం (జూన్‌ 14) ముంబై ఎయిర్‌పోర్టులో తళుక్కుమన్నారు. కూతురు ఆరాధ్యతో కలిసి వెకేషన్‌కు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఐశ్వర్య, అభిషేక్ బ్లాక్ హూడీలో కనిపించారు. ఆరాధ్య ఎరుపు రంగు హూడీలో వచ్చింది. ఎయిర్‌పోర్టులోకి వెళ్లే క్రమంలో గుర్తింపు పత్రాలను సెక్యురిటీ తనిఖీ చేస్తున్నసమయంలో ఐశ్వర్య ఫొటోలకు ఫోజులిచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

వీటిని చూసిన నెటిజన్లు కొన్ని ఆసక్తికర విషయాలను గుర్తించారు. అదేంటంటే.. ఎక్కడికి వెళ్లినా కూతురు చెయ్యి పట్టుకుని, జాగ్రత్తగా తీసుకెళ్లే ఐశ్వర్య ఈ సారి కూతురు చెయ్యిని వదిలేసింది. పైగా కూతురే తన చెయ్యి పట్టుకోవడానికి ప్రయత్నించినా.. పట్టించుకోనట్లు వ్యవహరించింది. తన హెయిర్‌ స్టైల్‌ కూడా పూర్తిగా మార్చేసినట్లు వీడియోలో కనిపిస్తుంది. దీంతో నెటిజన్లు భిన్నకామెంట్లు చేస్తున్నారు.  ‘ప్రతి కోణం నుంచి కూడా ఐశ్వర్య పర్ఫెక్ట్‌గా కనిపిస్తోంది’, ‘ఐశ్వర్య కావాలనే కూతురి చేయి పట్టుకోవడం లేదు. అది కూడా ఒకందుకు మంచి విషయమే. తల్లిదండ్రులపై ఆధారపడకుండా ఆరాధ్య పబ్లిక్‌గా నడిచేంత పరిణతి సాధించింది’ అని పలువురు కామెంట్‌ సెక్షన్‌లో తమ అభిప్రాయాలు పంచుకున్నారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Voompla (@voompla)

ఇక సినిమాల విషయానికొస్తే.. గత నెలలో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023 రెడ్ కార్పెట్‌ మీద వెండి గౌనులో నడిచి అందరి విమర్శలకు గురైన సంగతి తెలిసిందే. ఐశ్వర్య చివరిగా పొన్నియిన్ సెల్వన్ II మువీలో నందిని, ఆమెకు మూగ తల్లి మందాకిని దేవిగా ద్విపాత్రాభినయం చేసింది. నోరా ఫతేహీతో కలిసి అభిషేక్ ‘ఖజ్రా రే’ డ్యాన్స్ వీడియో ఆ మధ్య వైరల్‌ అయ్యింది. రెమో డిసౌజా కొత్త మువీలో వీరిద్దరూ జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి తాత్కాలికంగా ‘డ్యాన్సింగ్ డాడీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..