Tamannaah: ఫైట్స్ చేసిన గుర్తింపు రాలేదు.. బాహుబలి సినిమాపై తమన్నా కామెంట్స్..
ఈ సినిమా తమ సినీ ప్రయాణంలోనే ఎప్పటికీ గుర్తుండిపోతుందంటూ రమ్యకృష్ణ, అనుష్క చెప్పిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీపై మిల్కీబ్యూటీ తమన్నా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ సినిమాలో నటించడం వలన తనకు ఎలాంటి గుర్తింపు రాలేదని తెలిపింది.

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో చెప్పక్కర్లేదు. బాహుబలి 1, బాహుబలి 2 చిత్రాలు పాన్ ఇండియా లెవల్లో విడుదలై భారీగా వసూళ్లు రాబట్టాయి.. అంతేకాకుండా… రానా, ప్రభాస్, అనుష్క, తమన్నాలకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఇక ముఖ్యంగా శివగామి పాత్రలో దేశవ్యాప్తంగా ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్నారు రమ్యకృష్ణ. ఈ సినిమా తమ సినీ ప్రయాణంలోనే ఎప్పటికీ గుర్తుండిపోతుందంటూ రమ్యకృష్ణ, అనుష్క చెప్పిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీపై మిల్కీబ్యూటీ తమన్నా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ సినిమాలో నటించడం వలన తనకు ఎలాంటి గుర్తింపు రాలేదని తెలిపింది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా బాహుబలి సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. బాహుబలి లాంటి సినిమాల వల్ల కేవలం హీరోలకు మాత్రమే గుర్తింపు వస్తుందని తన అభిప్రాయం అని తెలిపింది. ఈ సినిమాలో నటించిన ప్రభాస్, రానా ఇద్దరూ గ్లోబల్ స్తాయిలో సక్సెస్ అయ్యారని.. అలాగే అనుష్క, రమ్యకృష్ణలకు కూడా కొంతపేరు వచ్చిందని.. కానీ తన పాత్ర మాత్రం అతిథి పాత్రగానే ఉండిపోయిందని తెలిపిందే. అందకు తనకు అంతగా గుర్తింపు రాలేదని.. ఈ సినిమా కోసం ప్రభాస్, రానా ఇద్దరూ చాలా కష్టపడ్డారని.. వాళ్లు ప్రశంసలు అర్హులని తెలిపింది.
బాహుబలి సినిమాను సక్సెస్ ను తాను క్యాష్ చేసుకోలేకపోయాని.. కానీ ఆ సినిమాలో తనది చిన్న పాత్ర అయిన.. చాలా కీలకమైనదని సంతోషం వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం తమన్నా.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న భోళా శంకర్ సినిమాలో నటిస్తోంది. అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న జైలర్ చిత్రంలోనూ నటిస్తుంది. ఇవే కాకుండా.. హిందీలో పలు చిత్రాల్లో నటిస్తుండగా.. వెబ్ సిరీస్ కూడా చేస్తుంది.




మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.