Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Triplets Born: ఆయనకు 62, ఆమెకు 30.. ఒకే కాన్పులో ‘ట్రిపుల్‌ ధమాకా’ ఇదో విచిత్ర ఫ్యామిలీ

62 ఏళ్ల వయసులో ఓ వ్యక్తి ఒకేసారి ముగ్గురు పిల్లల తండ్రయ్యాడు. ఆయన రెండో భార్య ఒకే కాన్పుల్లో మంగళవారం ఉదయం ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..

Triplets Born: ఆయనకు 62, ఆమెకు 30.. ఒకే కాన్పులో 'ట్రిపుల్‌ ధమాకా' ఇదో విచిత్ర ఫ్యామిలీ
62 Years Old Man Becames Father
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 15, 2023 | 9:29 AM

భోపాల్: 62 ఏళ్ల వయసులో ఓ వ్యక్తి ఒకేసారి ముగ్గురు పిల్లల తండ్రయ్యాడు. ఆయన రెండో భార్య ఒకే కాన్పుల్లో మంగళవారం ఉదయం ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..

సత్నా జిల్లాలో ఉచెహ్రా మండలం అతర్వేదియా ఖుర్ద్‌ గ్రామానికి చెందిన గోవింద్‌ కుష్వాహా (62) కొంతకాలం క్రితం హీరాబాయి కుష్వాహా (30)ను రెండో వివాహం చేసకున్నాడు. ఈ క్రమంలో ఆమె గర్భందాల్చగా సోమవారం రాత్రి హీరాబాయికి పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో హుటాహుటీనా జిల్లా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సిజేరియన్‌ చేసి ప్రసవం చేశారు. హీరాబాయి ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. ఒకేసారి ముగ్గురు పిల్లలకు తండ్రయ్యే సరికి గోవింద్‌ కుష్వాహా ఆనందానికి అవదులు లేవు. శిశువులు కాస్త బలహీనంగా ఉండటంతో ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్యుడు అమర్‌ సింగ్‌ తెలిపారు.

గోవింద్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను రెండు పెళ్లిళ్లు చేసుకున్నాను. నా మొదటి భార్య పేరు కస్తూరిబాయి. ప్రస్తుతం ఆమెకి 60 ఏళ్లు. మాకు కుమారుడు పుట్టాడు. ఐతే 18 ఏళ్ల వయసులో రోడ్డు ప్రమాదంలో మరణించాడు. దీంతో నా మొదటి భార్య కస్తూరిబాయే దగ్గరుండి మరీ నాకు రెండో వివాహం జరిపించింది. పెళ్లయిన ఆరేళ్లకు హీరాబాయి ముగ్గురు పిల్లలకు జన్మనివ్వడంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.