Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మిస్టరీ డెత్: 4 రోజులుగా కుళ్లిన శవాల మధ్య సజీవంగా నవజాత శిశువు.. అంతుచిక్కని అసలు కథ

ఆ ఇంట్లో ఇద్దరు దంపతులు మూడు రోజులుగా విగతజీవులుగా పడి ఉన్నా ఎవరూ గమనించలేదు. ముక్కుపుటాలు పగిలిపోయేంత దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం. తలుపులు తెరచిచూడగా శవాల మధ్యలో కేవలం రోజుల వయసున్న పసిబిడ్డ సజీవంగా ఉండటం చూసి అంతా షాక్‌కు..

మిస్టరీ డెత్: 4 రోజులుగా కుళ్లిన శవాల మధ్య సజీవంగా నవజాత శిశువు.. అంతుచిక్కని అసలు కథ
Dehradun Crime
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 15, 2023 | 10:50 AM

డెహ్రాడూన్: ఆ ఇంట్లో ఇద్దరు దంపతులు మూడు రోజులుగా విగతజీవులుగా పడి ఉన్నా ఎవరూ గమనించలేదు. ముక్కుపుటాలు పగిలిపోయేంత దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం. తలుపులు తెరచిచూడగా శవాల మధ్యలో కేవలం రోజుల వయసున్న పసిబిడ్డ సజీవంగా ఉండటం చూసి అంతా షాక్‌కు గురయ్యారు. ఈ విషాద ఘటన జూన్ 13న ఉత్తరాఖండ్‌ రాజధాని డెహ్రాడూన్‌లో వెలుగుచూసింది.

నాగల్ జిల్లా సహరాన్​పుర్‌కు చెందిన కాసిఫ్‌ అనే వ్యక్తి ఆనమ్ అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ టర్నర్​ రోడ్డు C-13లోని సొహైల్​అనే వ్యక్తి ఇంట్లో నాలుగు నెలలుగా అద్దెకు ఉంటున్నారు. గర్భవతైన ఆనమ్‌ జూన్ 9న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పండంటి మగ శిశువుకు జన్మనిచ్చింది. అదే రోజు సాయంత్రం ఆనమ్​ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ అయ్యి ఇంటికి వచ్చింది. అప్పటి నుంచి నుంచి ఆ ఇల్లు బయటి నుంచి తాళం వేసి ఉంది. సరిగ్గా నాలుగో రోజున తర్వాత ఆ ఇంటి నుంచి భరించలేనంత దుర్వాసన వచ్చింది. మృతుడి మొదటి భార్య నుస్రత్ సమాచారం మేరకు సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా ఆనమ్, ఆమె భర్త కుళ్లిన స్థితిలో విగత జీవులుగా పడి ఉన్నారు. మృతదేహాల పక్కనే నాలుగు రోజుల పసిబిడ్డ సజీవంగా ఉంది.

పోలీసులు రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. భార్యభర్తలిరువురు ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. నుస్రత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని, దర్యాప్తులో పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. చిన్నారిని ఆసుపత్రికి తీసుకొచ్చే సమయానికి స్పృహలోనే ఉన్నాడని వైద్యులు తెలిపారు. ఐతే శరీరంపై చాలా పురుగులున్నాయని, ప్రస్తుతం చిన్నారికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. ఐతే మూడు రోజులుగా తల్లిపాలు కూడా లేకుండా పిల్లవాడు ఆరోగ్యంగా ఎలా ఉన్నాడనే విషయం అంతుచిక్కడంలేదని చిన్నారికి వైద్యం చేస్తోన్న డాక్టర్ ధనుంజయ్ అనుమానం వ్యక్తం చేశాడు.

ఇవి కూడా చదవండి

కాగా కాసిఫ్ మొదటి భార్య నుస్రత్‌తో మాట్లాడుతూ.. జూన్ 10వ తేదీ రాత్రి చివరిసారిగా తనతో మాట్లాడాడని, మరుసటి రోజు సహరాన్‌పూర్‌కు వస్తానని చెప్పినట్లు పోలీసులకు తెల్పింది. కాసిఫ్‌కు చాలా అప్పులు ఉన్నాయని, జూన్ 11న ఓ వ్యక్తి వద్ద రూ.5 లక్షలు అప్పుగా తీసుకున్నాడని చెప్పింది. రెండు రోజులు గడుస్తున్నా ఇంకా ఇంటికి రాకపోవడంతో పలుమార్లు కాసిఫ్‌కు ఫోన్ చేశానని, ఫోన్ స్విచ్ఛాఫ్​రావడంతో అతని ఇంటికి వచ్చి చూడగా ఇళ్లు తాళం వేసి ఉందని చెప్పింది. ఐతే ఇంట్లో నుంచి పిల్లాడి ఏడుపు వినిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చానని తెల్పింది. కాగా కాసిఫ్ రెండో పెళ్లి చేసుకున్నట్లు నుస్రత్‌కు తెలియదు. కాసిఫ్‌కు మొదటి భార్యకు ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.