AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai Local Train: కదులుతున్న లోకల్ రైలులో యువతిపై లైంగిక దాడి..

మహారాష్ట్రలోని ముంబయిలో అవమానవీయ ఘటన చోటుచేసుకుంది. కదులుతున్న లోకల్ ట్రైన్‌లో ఓ 20 ఏళ్ల యువతిని ఓ వ్యక్తి లైంగిక దాడి చేయడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే గిర్‌గౌన్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ నావీ ముంబయిలోని ఓ పరీక్ష రాసేందుకు బయలుదేరింది.

Mumbai Local Train: కదులుతున్న లోకల్ రైలులో యువతిపై లైంగిక దాడి..
Train
Aravind B
|

Updated on: Jun 15, 2023 | 10:42 AM

Share

మహారాష్ట్రలోని ముంబయిలో అవమానవీయ ఘటన చోటుచేసుకుంది. కదులుతున్న లోకల్ ట్రైన్‌లో ఓ 20 ఏళ్ల యువతిని ఓ వ్యక్తి లైంగిక దాడి చేయడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే గిర్‌గౌన్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ నావీ ముంబయిలోని ఓ పరీక్ష రాసేందుకు బయలుదేరింది. ఇందుకోసం సీఎస్‌ఎమ్‌టీ వద్ద హర్బర్ లైన్ లోకల్ ట్రైన్‌ను ఎక్కింది. ఆ రైలు కదలడం ప్రారంభమైన వెంటనే ఆమె ఉన్న లేడీస్ కంపార్ట్‌మెంట్‌లోకి ఓ 40 ఏళ్ల వ్యక్తి ఎక్కాడు. అందులో ఎవ్వరూ లేరు ఆ కంపార్ట్‌ మొత్తం ఖాళీగానే ఉంది. ఇంతలో ఆ ట్రైన్ వెళ్తుండగానే ఆ వ్యక్తి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆమె అరవడం మొదలుపెట్టి దూరంగా పారిపోవడంతో.. ఆ వ్యక్తి మస్‌జీద్ స్టేషన్ వద్ద దిగిపోయాడు.

అనంతరం ఆమె రైల్వే పోలీసులకు ఈ ఘటనపై ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన జీఆర్పీ, ఆర్పీఎఫ్, ముంబయి పోలీసులు నిందితుడి కోసం గాలించారు. మస్‌జీద్ స్టేషన్‌లో ఉన్న సీసీటీవీలను పరిశీలించారు. చివరికి ఆ నిందితుడ్ని గుర్తించి సాయంత్రం 4.00 గంటలకు అదుపులోకి తీసుకున్నారు. ఆ నిందుతుడు రోజువారి కూలిగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. అతనిపై అత్యాచారంతో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని.. ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

Follow Us
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!