AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏం జరిగిందో తెలియదు.. చూస్తుండగానే కుప్పకూలిన పార్కింగ్‌.. పదుల సంఖ్యలో వాహనాలు ధ్వంసం..

పార్కింగ్‌లో ఇప్పటికే సీసీటీవీలను ఏర్పాటు చేశారు. అదృష్టవశాత్తూ అక్కడ ఎవరూ లేరని వీడియో చూసిన వారు చెబుతున్నారు. పార్కింగ్ పూర్తిగా కూలిపోవడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడ పార్క్ చేసిన వాహనాలు కూడా కింద పడిపోయాయి. కారు పడిపోతున్న దృశ్యాన్ని మనం వీడియోలో చూడొచ్చు.

Parking Lot Collapses
Jyothi Gadda
|

Updated on: Jun 15, 2023 | 11:18 AM

Share

భూకంపం లేదు, వర్షం లేదు, ప్రకృతి వైపరీత్యం కనిపించలేదు. కానీ పార్కింగ్ కూలిపోయి వేలాది మంది గాయపడ్డారు. ఈ షాకింగ్‌ ఘటన పంజాబ్‌లోని మొహాలీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలియటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. పార్కింగ్‌లో పార్క్ చేసిన పలు వాహనాలు శిథిలాల కింద కూరుకుపోయాయి. ఈ ఘటన బుధవారం సాయంత్రం మొహాలీ సెక్టార్-83లో చోటుచేసుకుంది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు.ఘటన జరిగినప్పుడు అక్కడ ఎవరూ లేరు. ఆ సమయంలో అక్కడ ఎవరైనా ఉండి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేది. కూలిన పార్కింగ్ పక్కనే నిర్మాణంలో ఉన్న భవనం బేస్‌మెంట్‌లో తవ్వకాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత పార్కింగ్‌ కూలిపోయింది.

పార్కింగ్‌లో ఇప్పటికే సీసీటీవీలను ఏర్పాటు చేశారు. అదృష్టవశాత్తూ అక్కడ ఎవరూ లేరని వీడియో చూసిన వారు చెబుతున్నారు. పార్కింగ్ పూర్తిగా కూలిపోవడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడ పార్క్ చేసిన వాహనాలు కూడా కింద పడిపోయాయి. కారు పడిపోతున్న దృశ్యాన్ని మనం వీడియోలో చూడొచ్చు.

ఇవి కూడా చదవండి

ఈ ఘటనలో కొన్ని వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని, అయితే ఎలాంటి ప్రాణనష్టం, గాయాలు జరగకపోవడం సంతోషించదగిన విషయంగా పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో 9-10 బైక్‌లు, రెండు కార్లు దెబ్బతిన్నాయని మొహాలీ డీఎస్పీ హర్సిమ్రాన్ సింగ్ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేశామని చెప్పారు.

జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో

వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?

పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో

స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో

ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో

తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో

ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ

టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి

చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో

పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు