AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral video: నిర్లక్ష్యం ఖరీదు, గాల్లో కలిసిన ఇద్దరు చిన్నారుల ప్రాణాలు.. షాకింగ్ వీడియో.

ప్రతీ రోజూ రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యంగా మారుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఎదుటి వారి తప్పు, స్వీయ నిర్లక్ష్యం కారణం ఏదైనా.. రోడ్డు ప్రమాదాలు పెరుగుతూనే ఉన్నాయి. రోడ్డు ప్రమాదాల్లో నిర్లక్ష్యం కారణంగా జరుగుతున్నవే ఎక్కువ. తాజాగా తెలంగాణలోని ములుగు జిల్లాలో జరిగిన ఓ ప్రమాదం షాకింగ్‌కి గురి చేస్తోంది. ఈ ప్రమాదానికి..

Viral video: నిర్లక్ష్యం ఖరీదు, గాల్లో కలిసిన ఇద్దరు చిన్నారుల ప్రాణాలు.. షాకింగ్ వీడియో.
Viral Video
Narender Vaitla
|

Updated on: Jun 17, 2023 | 10:30 AM

Share

ప్రతీ రోజూ రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యంగా మారుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఎదుటి వారి తప్పు, స్వీయ నిర్లక్ష్యం కారణం ఏదైనా.. రోడ్డు ప్రమాదాలు పెరుగుతూనే ఉన్నాయి. రోడ్డు ప్రమాదాల్లో నిర్లక్ష్యం కారణంగా జరుగుతున్నవే ఎక్కువ. తాజాగా తెలంగాణలోని ములుగు జిల్లాలో జరిగిన ఓ ప్రమాదం షాకింగ్‌కి గురి చేస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోను తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ట్విట్టర్‌ వేదికగా పోస్ట్‌ చేశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. బైక్‌ నడుపుతోన్న వ్యక్తి నిర్లక్ష్యానికి ఇద్దురు చిన్నారుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.

వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి బైక్‌పై తన భార్యతోపాటు ఇద్దరు చిన్నారులతో వెళ్తున్నాడు. ఇదే సమయంలో చౌరస్తా వద్ద రోడ్డును దాటే ప్రయత్నం చేశాడు. అయితే అప్పటికే అటుగా ఓ బస్సు వేగంగా దూసుకొస్తుంది. ఈ విషయాన్ని గమనించని బైకర్‌ ఏమాత్రం స్లో చేయకుండా ముందుకు దూసుకొచ్చాడు. దీంతో ఈ విషయాన్ని గమనించని బస్సు డ్రైవర్‌ ఒక్కసారిగా బైక్‌ను ఢీకొట్టాడు. దీంతో బైక్‌పై ఉన్న చిన్నారులు దుర్మాణం చెందగా, భార్యభర్తలు తీవ్రంగా గాయపడ్డారు. ఇదంతా అక్కడే ఉన్న ఓ సిసీటీవీలో రికార్డ్‌ అయ్యింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్‌ చేసిన సజ్జనర్‌.. ఈ ప్రమాదం ములుగు జిల్లా మంగపేటలోని తెలంగాణ సెంటర్ వద్ద శుక్రవారం జరిగినట్లు తెలిపారు. నిర్లక్ష్యం, పరధ్యానం వల్లే ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ట్రాఫిక్ రూల్స్ పై సరైన అవగాహన లేకపోవడం కూడా ఈ తరహా ప్రమాదాలకు కారణమని సజ్జనర్‌ అభిప్రాయపడ్డారు. రహదారులపై వాహనాలు నడిపేటప్పుడు నిత్యం జాగ్రత్తగా ఉండాలి. ట్రాఫిక్‌ రూల్స్‌ను విధిగా పాటించాలి. ఇలా అజాగ్రత్తగా వాహనాలు నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకోకండని ఆయన హితవుపలికారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..