Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: ఇంట్లో ఉండకూడని వస్తువులు.. ఉంటే సంతోషాలను తరిమికొట్టి, దరిద్రాన్ని కొని తెచ్చుకున్నట్లే..

Vastu Tips: సనాతన హిందూ ధర్మంలో జ్యోతిష్య శాస్త్రానికి ఎంత ప్రాముఖ్యత ఉందో వాస్తు శాస్త్రానికి కూడా అంతే విశిష్టత ఉంది. వాస్తు ప్రకారం ఇంట్లో లేదా ఆఫీసులో కొన్ని రకాల వస్తువులకు నిర్ధష్టమైన స్థలం కేటాయించడమైంది. ఈ క్రమంలో ఆయా వస్తువులు వాటికి కేటాయించిన ప్రదేశంలో..

Vastu Tips: ఇంట్లో ఉండకూడని వస్తువులు.. ఉంటే సంతోషాలను తరిమికొట్టి, దరిద్రాన్ని కొని తెచ్చుకున్నట్లే..
Vastu Tips
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jun 16, 2023 | 6:50 AM

Vastu Tips: సనాతన హిందూ ధర్మంలో జ్యోతిష్య శాస్త్రానికి ఎంత ప్రాముఖ్యత ఉందో వాస్తు శాస్త్రానికి కూడా అంతే విశిష్టత ఉంది. వాస్తు ప్రకారం ఇంట్లో లేదా ఆఫీసులో కొన్ని రకాల వస్తువులకు నిర్ధష్టమైన స్థలం కేటాయించడమైంది. ఈ క్రమంలో ఆయా వస్తువులు వాటికి కేటాయించిన ప్రదేశంలో లేకపోవడం వాస్తు దోషంగా మారుతుంది. వాస్తు దోషాల ఫలితంగా ఇంట్లో లేదా ఆఫీసులో ఉండేవారికి ఆరోగ్య పరిస్థితి సరిగా ఉండదు. ఇంకా ఆర్థిక సమస్యలు, అశాంతి, ఆందోళన వంటి మానసిక సమస్యలు కూడా వెంటాడుతుంటాయి. అయితే వస్తువులను కేటాయించిన స్థలంలో పెట్టడం ఎంత ముఖ్యమో కొన్ని రకాల వస్తువులను ఇంటి నుంచి తీసేయడం కూడా అంతే ముఖ్యమని వాస్తు శాస్త్రం చెబుతోంది. అలా కాకుండా ఉండకూడని వస్తువులు ఇంట్లో ఉంటే అది కూడా వాస్తు దోషంగా పరిగణింగబడుతుంది. ఈ నేపథ్యంలో ఇంట్లో ఉండకూడని వస్తువులు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

పనిచేయని గడియారం:  వాస్తు ప్రకారం ఇంట్లో పనిచేయడని లేదా విరిగిన గడియారం ఉండకూడదు. ఎందుకంటే సమయాన్ని సూచించే గడియారం పనిచేయకపోతే.. ఆ ఇంటివారికి అశుభం. ఇంకా ఇంట్లోకి నెగెటీవ్ ఎనర్జీ వస్తుంది. అంతేకాక ఆ ఇంటివారు తలపెట్టిన ప్రతి పని మధ్యలోనే ఆగిపోతుంది.

విరిగిన వస్తువులు: ఇంట్లో విరిగిన పాత్రలు, వస్తువులు ఉండడం కూడా వాస్తు దోషమే. ఈ వస్తువులను ఇంట్లో ఉంచితే అశుభ ఫలితాలు కలుగుతాయి. ఆర్థిక నష్టం, ఆరోగ్య సమస్యలు వెంటాడతాయి. అంతేకాక కుటుంబ సభ్యులకు అశాంతి, ఆందోళన కూడా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

క్రూర మృగాల చిత్రాలు:  చాలా మంది తమ ఇంట్లో జంతువుల బొమ్మలను పెడుతుంటారు. అయితే ఆ బొమ్మలు హింసాత్మకమైనవి కాకుండా చూసుకోవడం మంచిది. ఎందుకంటే వాస్తు ప్రకారం.. అలాంటి క్రూర మృగాల బొమ్మలు కుటుంబ సభ్యుల మధ్య గొడవలు కలిగిలే చేస్తాయి. ఇంకా బంధులవులో సంబంధాలు తెగిపోయే ప్రమాదం ఉంది. అంతేకాక అనుకోకుండా వాటిని చూసినప్పుడు మీరు భయపడే ప్రమాదం ఉంది, ఫలితంగా మీ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది. అలా జరగడం ప్రతి సారీ మంచిది కాదు.

పగిలిన గాజు: విరిగిన తేదా పగిలిన గాజులు ఇంట్లో ఉండడం అస్సలు మంచిది కాదు. ఇంకా అలాంటి వస్తువులు మీ జీవితంలో ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఫలితంగా మీరు ఎన్నో కష్టాల బారిన పడే ప్రమాదం ఉంది. కాబట్టి పగిలిన గాజు వస్తువులు ఇంట్లో ఉండే వెంటనే వాటిని తొలగించండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).