Bhadradri: బ్రిడ్జి‌పై నుంచి ఆటో బోల్తా.. ఇద్దరు చిన్నారులతో సహా నలుగురు దుర్మరణం.. దైవదర్శనం నుంచి వెళ్తుండగా..

Burgampahad: మండల కేంద్రమైన బూర్గంపాడు శివారులోని ఆంధ్ర సరిహద్దు కిన్నెరసాని బ్రిడ్జి అప్రోచ్ రోడ్డుపై నుంచి మహీంద్రా ట్రాలీ బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందగా మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఏలూరు జిల్లా టీ నర్సాపురం మండలం తిరుమలదేవిపేట గ్రామానికి..

Bhadradri: బ్రిడ్జి‌పై నుంచి ఆటో బోల్తా.. ఇద్దరు చిన్నారులతో సహా నలుగురు దుర్మరణం.. దైవదర్శనం నుంచి వెళ్తుండగా..
Burgampahad Incident
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jun 15, 2023 | 9:43 AM

Burgampahad : మండల కేంద్రమైన బూర్గంపాడు శివారులోని ఆంధ్ర సరిహద్దు కిన్నెరసాని బ్రిడ్జి అప్రోచ్ రోడ్డుపై నుంచి మహీంద్రా ట్రాలీ బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందగా మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఏలూరు జిల్లా టీ నర్సాపురం మండలం తిరుమలదేవిపేట గ్రామానికి చెందిన బి.నరసింహారావు, జట్ల దుర్గారావు, పచ్చి సాని శ్రీనివాసరావులకు చెందిన 12మంది కుటుంబ సభ్యులు మంగళవారం భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి దర్శనానికి మహేంద్ర ట్రాలీలో వచ్చారు. దర్శనం అనంతరం బుధవారం మధ్యాహ్నం స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు.

అయితే వీరు ప్రయాణిస్తున్న ట్రాలీ ఆటో బూర్గంపహాడ్ శివారులోని కిన్నెరసాని బ్రిడ్జి అప్రోచ్ రోడ్డుపై నుంచి అదుపుతప్పి వాగులోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురికి తీవ్ర గాయాలు అవ్వగా జట్ల దుర్గారావు(43), పచ్చి సాని శ్రీనివాసరావు(40) ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. ఇంకా దుర్గారావు ఇద్దరు కుమారులు సందీప్ (10), ప్రదీప్ (10) భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. కాగా ఘటన స్థలాన్ని సందర్శించిన బూర్గంపాడు ఎస్ఐ సంతోష్ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

Latest Articles
విద్యార్థుల ప్రేమకు భావోద్వేగానికి లోనైన టీచర్.. ఏం చేశారంటే!
విద్యార్థుల ప్రేమకు భావోద్వేగానికి లోనైన టీచర్.. ఏం చేశారంటే!
Video: ఇది కదా ఆనందమంటే.. భాంగ్రా స్టెప్పులేసిన కోహ్లీ, అర్షదీప్
Video: ఇది కదా ఆనందమంటే.. భాంగ్రా స్టెప్పులేసిన కోహ్లీ, అర్షదీప్
మ్యాచ్‌లో ఉత్కంఠ క్షణాలు మిస్సయ్యారా.. ఈ హైలైట్స్‌ వీడియో చూడండి
మ్యాచ్‌లో ఉత్కంఠ క్షణాలు మిస్సయ్యారా.. ఈ హైలైట్స్‌ వీడియో చూడండి
ఏం తినేటట్టు లేదు.. కొండెక్కిన కూరగాయల ధరలు.. దిగిరానంటూ మారాం..!
ఏం తినేటట్టు లేదు.. కొండెక్కిన కూరగాయల ధరలు.. దిగిరానంటూ మారాం..!
400 ఆలయాలతో పేర్చినట్లు ఉండే గ్రామం ఎక్కడో తెలుసా?
400 ఆలయాలతో పేర్చినట్లు ఉండే గ్రామం ఎక్కడో తెలుసా?
అర్జునుడి పాత్ర కోసం విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ ఏంతంటే..
అర్జునుడి పాత్ర కోసం విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ ఏంతంటే..
పాలతో అందం పదిలం.. మచ్చలేని మెరిసే చర్మం కోసం ఇలా ట్రై చేయండి..!
పాలతో అందం పదిలం.. మచ్చలేని మెరిసే చర్మం కోసం ఇలా ట్రై చేయండి..!
మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోంది: టీమిండియా క్రికెటర్లతో ప్రధాని
మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోంది: టీమిండియా క్రికెటర్లతో ప్రధాని
రిపోర్టే కీలకం.. పోలవరానికి విదేశీ నిపుణుల బృందం..
రిపోర్టే కీలకం.. పోలవరానికి విదేశీ నిపుణుల బృందం..
రాత్రి పడుకునే ముందు కాళ్లు కడిగితే ఏమవుతుందో తెలుసా..?
రాత్రి పడుకునే ముందు కాళ్లు కడిగితే ఏమవుతుందో తెలుసా..?