AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP TS Heat Wave: తెలుగు ప్రజలారా బీ అలెర్ట్.. ఉభయ రాష్ట్రాల్లోని ఆ ప్రాంతాల్లో మాడు పగిలే ఎండలు..

AP TS Weather Report: నైరుతీ రుతుపవనాల్లో చురుకుదనం కనిపించడం లేదు. వాతావరణంలో చల్లదనం లోపించింది. దీనికి తోడు అరేబియా సముద్రంలో బిపర్‌జాయ్ తుఫాను. ఇంకేముంది తెలుగు రాష్ట్రాలు వేడెక్కాయి. చాలా జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ హీట్ వేవ్ పరిస్థితులు మరో మూడు రోజులు కొనసాగుతాయని హెచ్చరించింది వాతావరణ శాఖ.

AP TS Heat Wave: తెలుగు ప్రజలారా బీ అలెర్ట్.. ఉభయ రాష్ట్రాల్లోని ఆ ప్రాంతాల్లో మాడు పగిలే ఎండలు..
AP TS Weather Report
శివలీల గోపి తుల్వా
|

Updated on: Jun 16, 2023 | 5:20 AM

Share

AP TS Weather Report: మృగశిర కార్తె కూడా వచ్చింది. నైరుతీ రుతుపవనాల ప్రభావం అస్సలు కనిపించట్లేదు. ఎండల తీవ్రత ఏమాత్రం తగ్గడంలేదు. ప్రస్తుతం రెండు రాష్ట్రాలూ భగ్గుమంటున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అనేక ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు నైరుతి రుతుపవనాలు ఈ నెల 19 వరకు తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందని వెల్లడించింది. కానీ ఈ నెల 10 వరకే రుతుపవాలు రాష్ట్రంలోకి ప్రవేశించాల్సి ఉండగా.. ప్రతికూల పరిస్థతుల వల్ల నైరుతి రుతుపవనాల ఆగమనం ఆలస్యం అవుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

అటూ ఏపీలోనూ ఎండలు మండిపోతున్నాయి. భానుడు సెగలు కక్కుతున్నాడు. ఓ వైపు ఎండలు.. మరోవైపు అకాస్మాత్తుగా కురుస్తున్న వర్షాలు రాష్ట్ర ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మరో మూడు రోజుల పాటు హీట్ వేవ్ పరిస్థితులు కొనసాగుతాయని భారత వాతావరణ విభాగం స్పష్టం చేసింది. ఈ నెల 18వ తేదీ వరకూ రాష్ట్రంలో 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలు ఉన్నట్టు అమరావతి వాతవరణ కేంద్రం తెలిపింది. ప్రత్యేకించి ఉత్తర, కోస్తాంధ్ర జిల్లాల్లో తీవ్ర ఉక్కపోత, వేడిమి పరిస్థితులు కొనసాగే అవకాశముందని అంచనా వేస్తున్నారు..

కాగా, నాలుగు రోజుల క్రితమే నైరుతీ రుతుపవనాలు రాష్ట్రంలోని శ్రీ హరి కోట వరకూ విస్తరించినా పశ్చిమ తీరంలోని బిపర్‌జోయ్ తుఫాను కారణంగా ముందుకు కదలకపోవటంతో ప్రస్తుతం రాష్ట్రంలో వేడిమి పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇక ఈ నెల 18, 19 తేదీన రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షం కురిసే అవకాశముందని ఐఎండీ అంచనా వేస్తోంది. నైరుతీ రుతుపవనాల్లో చురుకుదనం, చల్లదనం లోపించడం, అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్‌జాయ్ తుఫాను వల్ల.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం వేడెక్కింది. చాలా జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ తీవ్రత దాటికి జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ హీట్ వేవ్ పరిస్థితులు మరో మూడు రోజులు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..