AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Jagan: భవిష్యత్‌లో ఏపీ నుంచి ఒక ఐపీఎల్‌ టీం: క్రీడలపై సమీక్షలో సీఎం జగన్‌

ఏపీ సీఎం జగన్‌ క్రీడలు, యువజన సర్వీసులశాఖలపై దృష్టిసారించారు. క్రీడలు, యువజన సర్వీసులపై సమీక్ష నిర్వహించారు. ఇక ఏపీ వ్యాప్తంగా 'ఆడుదాం ఆంధ్రా' పేరుతో క్రీడాసంబరాలను నిర్వహించనున్నట్టు ప్రకటించారు సీఎం జగన్‌. ఈ కార్యక్రమంలో భాగంగానే క్రికెట్‌, బ్యాడ్మింటన్‌, వాలీబాల్‌, కబాడీ, ఖోఖో పోటీలు నిర్వహించనున్నారు.

CM Jagan: భవిష్యత్‌లో ఏపీ నుంచి ఒక ఐపీఎల్‌ టీం: క్రీడలపై సమీక్షలో సీఎం జగన్‌
CM Jagan
Basha Shek
|

Updated on: Jun 15, 2023 | 9:53 PM

Share

ఏపీ సీఎం జగన్‌ క్రీడలు, యువజన సర్వీసులశాఖలపై దృష్టిసారించారు. క్రీడలు, యువజన సర్వీసులపై సమీక్ష నిర్వహించారు. ఇక ఏపీ వ్యాప్తంగా ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో క్రీడాసంబరాలను నిర్వహించనున్నట్టు ప్రకటించారు సీఎం జగన్‌. ఈ కార్యక్రమంలో భాగంగానే క్రికెట్‌, బ్యాడ్మింటన్‌, వాలీబాల్‌, కబాడీ, ఖోఖో పోటీలు నిర్వహించనున్నారు. క్రికెట్‌లాంటి క్రీడకు CSK మార్గదర్శకం చేసి, నిర్వహణలో పాల్గొననుంది. భవిష్యత్తులో ముంబై ఇండియన్స్‌ లాంటి జట్టు సహాయం కూడా తీసుకోనున్నట్టు వెల్లడించారు సీఎం జగన్‌. ప్రస్తుతం చెన్నై సూపర్‌కింగ్స్‌కు మూడు క్రికెట్‌ స్టేడియంలలో శిక్షణ కార్యక్రమాలు అప్పగించనున్నారు. భవిష్యత్తులో ఏపీ నుంచి కూడా ఒక ఐపీఎల్‌ టీం ఏర్పాటయ్యేలా ముందుకుసాగాలని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. అంబటిరాయుడు, కేఎస్‌.భరత్‌ లాంటి వాళ్లు రాష్ట్రంలోని యువకులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తారన్నారు జగన్‌. మరోవైపు మారుమూల ఆదివాసీ ప్రాంతాలకు 4 జీ సేవలను విస్త్రుత పరిచేలా 100 జియో టవర్లను క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు సీఎం. దీని ద్వారా 209 మారుమూల గ్రామాలకు సేవలు అందేలా రిలయన్స్‌ జియో సంస్థ టవర్లను ఏర్పాటు చేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 85, పార్వతీపురం మన్యం 10, అన్నమయ్య 3 టవర్లు, వైయస్సార్‌ జిల్లాలో 2 టవర్లను ప్రారంభించారు సీఎం జగన్.

కొత్తగాప్రారంభించిన సెల్‌టవర్ల కారణంగా మారుమూల ప్రాంతాలనుంచి నేరుగా సీఎం తో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు ఆయా జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ప్రజలు. గిరిజనులతో ఆన్‌లైన్‌లో ఇంటారాక్ట్‌ అయిన ముఖ్యమంత్రి డిసెంబర్‌ నాటికి అన్ని ప్రాంతాల్లో టవర్లు ఏర్పాటుకి ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుందన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి