Big News Big Debate: ఏపీలో అంతుచిక్కని పొత్తు పొడుపులు.. బీజేపీ ఎవరివైపు
ఏపీలో పొత్తులు వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. నిన్నటిదాకా టీడీపీ, బీజేపీతో కలిసే వస్తామన్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కత్తిపూడిలో కొత్త స్వరం వినిపించారు. అటు నాలుగేళ్లుగా బీజేపీని పల్లెత్తు మాట కూడా అనని టీడీపీ.. ఇప్పుడు ఏకంగా కేంద్రంలోని పెద్దలనే ప్రశ్నిస్తోంది. ఇక ఇంతకాలం కుటుంబపార్టీలతో పొత్తు ప్రసక్తే లేదన్న బీజేపీ రాష్ట్ర నాయకులు ఇప్పుడు దేశం కోసం ఎవరితో అయినా కలుస్తామంటున్నారు. ఏపీలో పార్టీల మధ్య ఏదో జరుగుతుంది.. కానీ ఎవరికీ ఈ పొత్తు పొడుపులు అంతుచిక్కడం లేదు.
వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యం అంటున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి అధికారపార్టీపై విమర్శల వర్షం కురిపించారు. ఏపీ సీఎం జగన్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూనే ముఖ్యమంత్రి పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. చాలాకాలం తర్వాత పొత్తుల ప్రస్తావన లేకుండానే సాగిన పవన్ ప్రసంగం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ అయింది. ఉమ్మడిగా వస్తామో సింగిల్‌గా వస్తామో కానీ అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయమన్న పవన్ పొత్తులపై మరోసారి ట్విస్ట్ ఇచ్చారు. అయితే జనసేన పార్టీ పుట్టిందే టీడీపీని బతికించడానికి అంటోంది వైసీపీ. వారాహి కాదు.. నారాహి యాత్ర సరిగ్గా సరిపోతుందన్నారు అధికారపార్టీ ఎమ్మెల్యేలు.
Published on: Jun 15, 2023 07:00 PM
వైరల్ వీడియోలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

