Shocking Video: అమ్మో బొమ్మా..! అర్థరాత్రి అరుపులతో, కూతురుని భయపెట్టిన తండ్రి.. అసలేం జరిగిందంటే..?

Shocking Video: తాడును చూసి కూడా దాన్ని పాము అనుకొని భ్రమపడిన సందర్భాలు మనకు చాలానే ఉంటాయి. అలాగే అనుకోకుండా క్రూరమైన జంతువుల బొమ్మలను చూసి అవి నిజమైనవే అని భయపడిన ఘటనలు కూడా జరిగే ఉంటాయి. అలాంటి ఘటనకు సంబంధించిన..

Shocking Video: అమ్మో బొమ్మా..! అర్థరాత్రి అరుపులతో, కూతురుని భయపెట్టిన తండ్రి.. అసలేం జరిగిందంటే..?
Viral Video Visuals
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jun 17, 2023 | 7:20 AM

Shocking Video: తాడును చూసి కూడా దాన్ని పాము అనుకొని భ్రమపడిన సందర్భాలు మనకు చాలానే ఉంటాయి. అలాగే అనుకోకుండా క్రూరమైన జంతువుల బొమ్మలను చూసి అవి నిజమైనవే అని భయపడిన ఘటనలు కూడా జరిగే ఉంటాయి. అలాంటి ఘటనకు సంబంధించిన వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూస్తే నవ్వు ఆపుకోవడం మీ వల్ల కాదు అంటే అతిశయోక్తి కానే కాదు. అంతలా భయంతో కేకలు వేశాడు ఓ వ్యక్తి. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు విపరీతంగా నవ్వుకుంటూ.. రకరకాలుగా కామెంట్లతో, ఫన్నీ ఎమోజీలతో స్పందిస్తున్నారు.

నెట్టింట వైరల్ అవుతున్న వీడియో love_feel_music_1 అనే ఇన్‌స్టా ఖాతా నుంచి జూన్ 2న షేర్ అయింది. ఈ వీడియోలో ఓ వ్యక్తి తన ఫోన్ చూసుకుంటూ వెళ్లి తన చిన్నారి కూతురు పక్కన పడుకోబోతాడు. అయితే ఆ చిన్నారి తాను ఆడుకునే బొమ్మను పక్కన పెట్టుకుని పడుకుంది. అది తెలియన సదరు వ్యక్తి ఆ బొమ్మను చూసి ఒక్కసారిగా భయపడిపోయి కేకలు వేశాడు. అంతే.. అతను వేస్తున్న కేకలకు బెడ్‌ మీదే పడుకుని ఉన్న తన భార్య, కూతురు కూడా భయపడిపోయి లేచారు. ఇంకా తన కూతురు అయితే వణికిపోతూ తల్లి దగ్గరకు వెళ్లింది. ఇక అతను ఎంతలా భయపడ్డాడో చెప్పడం సాధ్యం కాదు కానీ తన గుండెలపై చేతులు పెట్టుకున్న అతన్ని చూస్తే మీకే అర్ధం అవుతుంది.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న వీడియోను ఇక్కడ చూడండి.. 

చెప్పడానికి, చదవడానికి సాధారణంగా ఉన్నప్పటికీ ఆ వీడియో చూస్తే ఆపకుండా నవ్వేస్తారు. ఇదే తరహాలో వీడియోను చూసి నవ్వేసుకుంటున్న నెటిజన్లు వారి వారి స్పందనలను కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు. ‘హార్ట్ ఎటాక్ వచ్చేంతలా భయపడ్డాడు అతను’.., ‘నవ్వు  ఆపుకోలేకపోతున్నాను దేవుడా’.., ‘వీడియోను రెండో సారి చూడకుండా ఉండడం ఎవరి వల్ల కాని పని, మళ్ళీ మళ్లీ చూడాలనిపించే వీడియో ఇది’.., ‘అసలు ఏమిటది.. అంతలా అతను భయపడిపోవడానికి ఏముంది అసలు అందులో’ అని రాసుకొచ్చారు కొందరు నెటిజన్లు. మరోవైపు ఈ వీడియోకు ఇప్పటివరకు 2 లక్షల వరకు లైకులు.. 23 లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

రాజమౌళికే నో చెప్పిన టాలీవుడ్ హీరోయిన్..
రాజమౌళికే నో చెప్పిన టాలీవుడ్ హీరోయిన్..
లక్షల్లో విషపూరిత పాములు కాలు పెట్టారంటే.. నేరుగా యమలోకానికి..
లక్షల్లో విషపూరిత పాములు కాలు పెట్టారంటే.. నేరుగా యమలోకానికి..
చైనాలో ఉంటూ చరిత్ర సృష్టించిన తెలుగు కుటుంబం..!
చైనాలో ఉంటూ చరిత్ర సృష్టించిన తెలుగు కుటుంబం..!
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ ను గెలుచుకున్న లక్ష్మీ నారాయణ
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ ను గెలుచుకున్న లక్ష్మీ నారాయణ
వరినాట్లు వేయడానికి వచ్చి బిత్తరపోయిన రైతు.. కనిపించింది చూడగా
వరినాట్లు వేయడానికి వచ్చి బిత్తరపోయిన రైతు.. కనిపించింది చూడగా
ఆరేళ్ల తరువాత హైదరాబాద్ ఎందుకు ఇలా వణుకుతోంది.? వీడియో..
ఆరేళ్ల తరువాత హైదరాబాద్ ఎందుకు ఇలా వణుకుతోంది.? వీడియో..
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీని వదలని వర్షాలు.!
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీని వదలని వర్షాలు.!
చింత పండుతో కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టవచ్చు..
చింత పండుతో కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టవచ్చు..
రైలు ప‌ట్టాలపై నడుచుకుంటూ వెళ్తున్న వింత ఆకారం.. ఏంటాని చూడగా..
రైలు ప‌ట్టాలపై నడుచుకుంటూ వెళ్తున్న వింత ఆకారం.. ఏంటాని చూడగా..