Ashes 2023: బ్రాడ్‌మాన్, కుక్ రికార్డులను బ్రేక్ చేసిన జో రూట్.. ఒంటరి పోరాటంతోనే అజేయమైన సెంచరీ..

Ashes 2023: ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో ఇంగ్లీష్ మాజీ కెప్టెన్ జోరూట్ అజేయమైన సెంచరీతో చెలరేగాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లాండ్ టీమ్ 393 పరుగులు చేయగలిగింది. అయితే రూట్ తన సెంచరీతో అంతర్జాతీయ క్రికెట్‌లో ఆల్ టైమ్ లెజెండ్ అయిన..

Ashes 2023: బ్రాడ్‌మాన్, కుక్ రికార్డులను బ్రేక్ చేసిన జో రూట్.. ఒంటరి పోరాటంతోనే అజేయమైన సెంచరీ..
Cook; Root; Bradman
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jun 17, 2023 | 6:11 AM

Ashes 2023: ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో ఇంగ్లీష్ మాజీ కెప్టెన్ జోరూట్ అజేయమైన సెంచరీ(118)తో చెలరేగాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లాండ్ టీమ్ 393 పరుగులు చేయగలిగింది. అయితే రూట్ తన సెంచరీతో అంతర్జాతీయ క్రికెట్‌లో ఆల్ టైమ్ లెజెండ్ అయిన సర్ డాన్ బ్రాడ్‌మాన్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. ఎలా అంటే ఈ మ్యాచ్‌కు ముందు జో రూట్, బ్రాడ్‌మాన్ 29 టెస్ట్ సెంచరీలతో సమానంగా ఉండేవారు. ఇక శుక్రవారం చేసిన సెంచరీతో రూట్ తన 30వ శతకాన్ని పూర్తి చేసుకుని బ్రాడ్‌మాన్‌ని అధిగమించాడు. ఇదే కాక రూట్ ఇంగ్లాండ్ తరఫున అత్యంత వేగంగా 30 సెంచరీల మార్క్‌ని అందుకున్న ప్లేయర్‌గా కూడా అవతరించాడు.

అంతకముందు ఇంగ్లాండ్ తరఫున అత్యంత వేగంగా 30 శతకాలు చేసిన రికార్డు.. ఆ టీమ్ మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్( 239 ఇన్నింగ్స్) పేరిట ఉండేది. కానీ రూట్ తన మాజీ కెప్టెన్ కంటే వేగంగా 231 ఇన్నింగ్స్‌ల్లోనే 30వ సెంచరీ చేశాడు. ఇలా రూట్ తన 30వ సెంచరీలో సర్ బ్రాడ్‌మాన్, అలెస్టర్ కుక్ పేరిట ఉన్న రికార్డులను బ్రేక్ చేసి తనదైన మార్క్ చూపించాడు.

కాగా, గురువారమే ప్రారంభమైన యాషెస్ తొలి టెస్టులో ముందుగా ఇంగ్లాండ్ టీమ్  బ్యాటింగ్ చేసింది. 393 పరుగులకు ఆలౌట్ అయిన ఆ టీమ్ తరఫున రూట్ సెంచరీతో నిలవగా.. జాక్ క్రాలే(61), జానీ బెయిర్‌స్టో(78) అర్థ సెంచరీలతో రాణించారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లియాన్ మరోసారి 4 వికెట్లతో మెరిసాడు. అలాగే జోష్ హజల్‌వుడ్ 2, స్కాట్ బోలాండ్, కామెరూన్ గ్రీన్ చెరో వికెట్ తీసుకున్నారు. ఇక అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన ఆసీస్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ కోల్పోకుండా 14 పరుగులు చేసింది. క్రీజులో టీమ్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్(8), ఉస్మాన్ ఖవాజా(4) ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..