ENG vs AUS: సరికొత్త చరిత్రకు కొద్ది దూరంలో.. యాషెస్ సిరీస్‌లో రికార్డులు బ్రేక్ చేయనున్న ఇద్దరు.. ఎవరంటే?

Ashes Series 2023: యాషెస్ సిరీస్ 2023 ప్రారంభమైంది. బర్మింగ్‌హామ్ వేదికగా ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య సిరీస్‌లో తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్లు జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ ప్రత్యేక రికార్డులు నెలకొల్పో ఛాన్స్ ఉంది.

ENG vs AUS: సరికొత్త చరిత్రకు కొద్ది దూరంలో.. యాషెస్ సిరీస్‌లో రికార్డులు బ్రేక్ చేయనున్న ఇద్దరు.. ఎవరంటే?
Ashes 2023 Eng Vs Aus
Follow us
Venkata Chari

|

Updated on: Jun 17, 2023 | 6:44 AM

Ashes Series 2023, England vs Australia, 1st Test: యాషెస్ సిరీస్ 2023 ప్రారంభమైంది. బర్మింగ్‌హామ్ వేదికగా ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య సిరీస్‌లో తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్లు జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ ప్రత్యేక రికార్డులు నెలకొల్పో ఛాన్స్ ఉంది. అండర్సన్‌కు తన టెస్టు కెరీర్‌లో 700 వికెట్లు పూర్తి చేసే అవకాశం ఉంది. బ్రాడ్ 600 వికెట్లు కూడా పూర్తి చేయగలడు. ఇంగ్లండ్‌ తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఈ ఇద్దరూ అగ్రస్థానంలో ఉన్నారు.

ఇంగ్లండ్‌ టీం తరపున టెస్టు ఫార్మాట్‌లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్‌‌గా అండర్సన్‌ నిలిచాడు. ఇప్పటి వరకు ఆడిన 333 ఇన్నింగ్స్‌ల్లో 685 వికెట్లు తీశాడు. 700 వికెట్లు పూర్తి చేసేందుకు అండర్సన్‌కు 15 వికెట్లు అవసరం. ఈసారి యాషెస్‌ సిరీస్‌లో ఈ స్థానం సాధించవచ్చు. అండర్సన్ తన కెరీర్‌లో 32 సార్లు ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టాడు. 3 సార్లు 10 వికెట్లు పడగొట్టాడు.

ఇంగ్లండ్‌ జట్టు తరపున ఎక్కువ వికెట్లు తీసిన లిస్టులో స్టువర్ట్‌ బ్రాడ్‌ రెండో స్థానంలో నిలిచాడు. అతను 299 ఇన్నింగ్స్‌లలో 582 వికెట్లు తీశాడు. బ్రాడ్‌కి 600 వికెట్లు పూర్తి చేయడానికి 18 వికెట్లు అవసరం. ఈ ఫార్మాట్‌లో 15 పరుగులకు 8 వికెట్లు పడగొట్టడం అతని అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. ఇక టెస్టు మ్యాచ్‌ గురించి చెప్పాలంటే, అతను అత్యధికంగా 11 వికెట్లు పడగొట్టాడు. ఈ ఫార్మాట్‌లో బ్రాడ్ 20 సార్లు ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీశాడు. మూడు సార్లు 10 వికెట్లు పడగొట్టాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..