Team India: బ్యాడ్‌ఫాంతోనే కాదు.. కెప్టెన్సీలోనూ వైఫల్యం.. కట్‌చేస్తే.. షాక్ ఇచ్చేందుకు సిద్ధమైన బీసీసీఐ?
India vs West Indies Series, Rohit Sharma: డబ్ల్యూటీసీ తర్వాత టీమిండియా తదుపరి సిరీస్‌ని వెస్టిండీస్‌తో ఆడనుంది. అయితే, ఈ సిరీస్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు షాక్ ఇచ్చేందుకు బీసీసీఐ సిద్ధంగా ఉందనే వార్తలు వస్తున్నాయి.
భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ (WTC Final)లో ఓడిపోయిన తర్వాత ఆటగాళ్లందరూ స్వదేశానికి తిరిగి వచ్చి తమ కుటుంబాలతో సరదాగా గడుపుతున్నారు. కాగా, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు బీసీసీఐ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. భారత జట్టు తన తదుపరి సిరీస్‌ను వెస్టిండీస్‌తో (West Indies vs India) ఆడనుంది. కరీబియన్ దీవుల్లో పర్యటించనున్న టీమిండియా జులై 12 నుంచి రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్‌లో తలపడనుంది.
డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత భారత్ తదుపరి మ్యాచ్ జులై 12న జరగనుంది. దీంతో ఆటగాళ్లంతా దాదాపు నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్నారు. అయితే ఫామ్‌లో లేని కెప్టెన్ రోహిత్ శర్మను వెస్టిండీస్‌తో జరిగే మొత్తం టెస్టు లేదా వైట్‌బాల్ సిరీస్ నుంచి తొలగించే అవకాశం ఉందని సమాచారం. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు రోహిత్ శర్మకు అదనపు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. 3 వన్డేలు, 5 టీ20లు లేదా రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు రోహిత్ దూరం కావచ్చని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది.
ప్రస్తుతం వెస్టిండీస్ టీం ప్రస్తుతం బలహీనంగానే కనిపిస్తోంది. కానీ, తనదైన రోజున దిగ్గజ జట్లకు షాక్ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లనే వెస్టిండీస్ పంపాలని భారత సెలక్షన్ కమిటీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రోహిత్‌కు విశ్రాంతి సాకుతో పక్కనపెట్టనున్నట్లు తెలుస్తోంది.
టీమిండియా వెస్టిండీస్ పర్యటన టెస్టులతో ప్రారంభం కానుంది. డొమినికాలోని విండ్సర్ పార్క్ మైదానంలో జులై 12 నుంచి 16 వరకు తొలి టెస్టు జరగనుంది. ఆ తర్వాత రెండో టెస్టు ట్రినిడాడ్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్‌లో జులై 20 నుంచి 24 వరకు జరగనుంది.
టెస్టుల తర్వాత మూడు వన్డేల సిరీస్ మొదలుకానుంది. మొదటి, రెండు వన్డేలు బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌లో జులై 27, 29 తేదీలలో, మూడో వన్డే ఆగస్టు 1న ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీ గ్రౌండ్‌లో జరుగుతాయి.
సిరీస్‌లో చివరగా టీ20 సిరీస్ జరగనుంది. ఆగస్టు 3న బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీలో జరిగే తొలి మ్యాచ్‌తో టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఆగస్టు 6, 8 తేదీల్లో రెండో, మూడో టీ20, ఆగస్టు 12న 4వ మ్యాచ్, ఆగస్టు 12న 5వ మ్యాచ్, చివరి మ్యాచ్ 13న జరగనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..