WI vs IND: డబ్ల్యూటీసీ ఎఫెక్ట్.. చెత్త షాట్‌తో ఔట్.. కట్‌చేస్తే.. వెస్టిండీస్ పర్యటనకు నో ఛాన్స్.. ఆ సీనియర్ ప్లేయర్ ఎవరంటే?

West Indies vs India: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో చెతేశ్వర్ పుజారా ఘోరంగా ఫ్లాప్ అయ్యాడు. పేలవమైన షాట్ ఆడుతూ తన వికెట్ కోల్పోయాడు. దీంతో మాజీలు ఫైర్ అవుతున్నారు. ఈ ఎఫెక్ట్ కారణంగా వెస్టిండీస్ పర్యటనలో మొండిచేయి దక్కే అవకాశం ఉందని అంటున్నారు.

WI vs IND: డబ్ల్యూటీసీ ఎఫెక్ట్.. చెత్త షాట్‌తో ఔట్.. కట్‌చేస్తే.. వెస్టిండీస్ పర్యటనకు నో ఛాన్స్.. ఆ సీనియర్ ప్లేయర్ ఎవరంటే?
Aus Vs Ind Wtc Final
Follow us
Venkata Chari

|

Updated on: Jun 15, 2023 | 3:26 PM

Cheteshwar Pujara-Yashasvi Jaiswal: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా 209 పరుగుల తేడాతో భారత్‌ను చిత్తుగా ఓడించి, ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచేది. దీంతో వరుసగా రెండోసారి భారత్‌ ఛాంపియన్‌గా నిలవాలన్న కల కలగానే మిగిలిపోయింది. ఆ విషయం పక్కన పెడితే.. 2025 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ప్రారంభమైంది. వెస్టిండీస్ పర్యటనతో టీమిండియా తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ప్రస్తుతం భారత జట్టు నెల రోజులపాటు విశ్రాంతి తీసుకోనుంది. ఈ సిరీస్ జులైలో మొదలై, ఆగస్టులో ముగుస్తుంది.

వెస్టిండీస్‌ పర్యటనలో రోహిత్ సేన బిజీగా ఉంటుంది. వచ్చే నెలలో భారత్, వెస్టిండీస్ టీంలు 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల్లో తలపడనున్నాయి. టెస్టు సిరీస్‌తో భారత్ ఈ పర్యటనను మొదలుపెట్టనుంది. ఈ సిరీస్‌లో జట్టులో కొన్ని కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి.

పుజారా స్థానానికి ఎసరుపెట్టిన జైస్వాల్..

క్రిక్‌బజ్ వార్తల ప్రకారం, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం బ్యాకప్ ప్లేయర్‌గా యశస్వి జైస్వాల్‌ను చేర్చిన సంగతి తెలిసిందే. అయితే, వెస్టిండీస్ టూర్‌లో చెతేశ్వర్ పుజారా స్థానంలోకి ఈ యంగ్ ప్లేయర్ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. పుజారా భారత టెస్ట్ జట్టులో నంబర్ 3 కీలక బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అయితే గత కొంతకాలంగా పేలవమైన ఫామ్‌తో పోరాడుతున్న పుజారా.. 2020 నుంచి ఇప్పటి వరకు పుజారా బ్యాట్ నుంచి 52 ఇన్నింగ్స్‌లలో ఒక సెంచరీ మాత్రమే వచ్చింది. ఈ సమయంలో పుజారా సగటు 29.69గా నిలిచింది.

పుజారా షాట్ ఎంపికలపై దుమారం..

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌ 2023లో పుజారాపై భారీగా అంచనాలు ఉన్నాయి. కానీ, ఓ చెడ్డ షాట్ ఆడి తన వికెట్‌ను సమర్పించుకున్నాడు. గతంలో కూడా చాలాసార్లు అతని షాట్ ఎంపికలపై ప్రశ్నలు వినిపించాయి. ఇలాంటి పరిస్థితుల్లో వెస్టిండీస్‌ సిరీస్‌లో పుజారా ఆడడం కష్టమేనని భావిస్తున్నారు. ఒకవేళ అతను జట్టులోకి ఎంపికైనప్పటికీ, ప్లేయింగ్ XIలో అవకాశం లభించడం కష్టం.

అద్భుత ఫామ్‌లో జైస్వాల్..

పుజారా ఔట్ అయితే.. జైస్వాల్ అతని స్థానంలో 3వ స్థానంలో బరిలోకి దిగవచ్చు. జైస్వాల్ గురించి మాట్లాడితే.. అతను అద్భుతమైన ఫామ్‌లో నడుస్తున్నాడు. ఐపీఎల్‌లో తుఫాన్ ఇన్నింగ్స్‌లతో పరుగుల వర్షం కురిపించాడు. జైస్వాల్ 14 మ్యాచ్‌ల్లో 48.08 సగటుతో 1 సెంచరీ, 4 హాఫ్ సెంచరీలతో సహా 625 పరుగులు నమోదు చేశాడు. దీంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ 2023లో చివరి నిమిషయంలో బ్యాకప్ ప్లేయర్‌గా ఎంపికయ్యాడు. రుతురాజ్ వివాహం కారణంగా భారత జట్టు నుంచి తప్పుకున్న తర్వాత జైస్వాల్‌కు అవకాశం దక్కింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..